Congress Party: భారత సైన్యానికి మద్దతుగా నిలిచేందుకు భారీ ర్యాలీ నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు మే 8న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నగరంలో ఈ ర్యాలీ నిర్వహించనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. ఈ ర్యాలీలు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు హాజరవుతారు. ఈ ర్యాలీ హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు జరుగుతుందని ఆ పార్టీ ప్రకటించింది.
