Allu Arjun: అల్లు అర్జున్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

Allu arjun: స్టైలిష్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఎంతో బిజీ షెడ్యూల్ గడుపుతున్న విషయం తెలిసిందే. ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. చిత్ర యూనిట్ దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ తతంగమంతా నడుస్తున్న టైంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాలని ఓ వ్యక్తి హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. ఎందుకంటే..

తనకు అభిమానులు కాదు… ఆర్మీ ఉందంటూ ప్రతి ఈవెంట్ లో అల్లు అర్జున్ చెపుతుండటం అందరికీ తెలిసిందే. ‘పుష్ప 2’ ఈవెంట్లలో కూడా ఇదే విషయాన్ని చెపుతూ వస్తున్నారు. దీనిపై గ్రీన్ పీస్ ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు భైరి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.తన అభిమాన సంఘానికి ‘అర్జున్ ఆర్మీ’ అని బన్నీ పేరు పెట్టుకున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఆర్మీ అనేది దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరు అని… ఈ పేరును అభిమాన సంఘానికి పెట్టుకోవడం సరికాదని అన్నారు. ఇదేదీ పట్టించుకోకుండా అల్లు అర్జున్ తనకు ఆర్మీ ఉందని చెపుతున్నారని… వెంటనే ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *