Ap news: ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. బాపట్ల జిల్లాలో కాలుజీ బస్సుకు మంటలు చెలరేగాయి. చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. మంటల్లో ఐఆర్‌ఈఎఫ్ నర్సింగ్ కాలేజీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సుకు మంటలు అంటుకోగానే అప్రమత్తమై, కిందకు దూకారు.
రేపల్లె నుంచి గుంటూరుకు పరీక్షల కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు విద్యార్థులు తెలిపారు. వెంటనే ఫైర్ పోలీసులకు ఫోన్ చేయగా ధర్నా స్థలానికి చేరుకున్నా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గతంలో ఇలాంటి ప్రాంణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామన్నారు.