Telangana: ఒకవైపు చలి ప్రభావంతో గజగజ వణుకుతున్న తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు మరో పిడుగు వచ్చి పడే ప్రమాదం నెలకొన్నది. రెండు రాష్ట్రాల వ్యాప్తంగా చలిగాలుల ప్రభావంతో సతమతం అవుతున్న జనానికి తుఫాన్ హెచ్చరికలతో ఆందోళనకు గురవుతున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయి రాత్రి వేళల్లో తీవ్రమైన చలి ప్రభావం ఉండగా, తుఫాన్ వల్ల మరింతగా చలి పెరిగే ప్రమాదం ముంచుకురానున్నది.
Telangana: నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఏర్పడి వాయువ్య దిశగా పయనమవుతుందని హెచ్చరించింది. ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి ఈ నెల 30న తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజులపాటు అంటే డిసెంబర్ 2వ తేదీ వరక ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు కురిసే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Telangana: ఈ తుఫాన్ ప్రభావంతో 30న అంటే శనివారం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూలు, గద్వాల, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసింది.
Telangana: అదే విధంగా డిసెంబర్ 1న తెలంగాణలోని ములుగు, భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల, కొత్తగూడెం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడి వానలు కురిసి అవకాశం ఉన్నది. ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ అయింది.
Telangana: డిసెంబర్ 2వ తేదీన రాష్ట్రంలోని వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు, జనగామ, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఆయా జిల్లాలకూ ఎల్లో అలర్ట్‌ను కూడా జారీ అయింది. డిసెంబర్ 3, 4 తేదీల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.