CM Revanth Reddy: ఉపాధ్యాయులు బాగా పనిచేస్తే నేను కూడా రెండో సారి ముఖ్యమంత్రిని కావాలని అనుకుంటున్నా.. ఇది హైదరాబాద్ మాదాపూర్ శిల్పకలా వేదికలో నిన్న నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నమాటలు.
2028 అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే వెళ్తాం. ఆనాడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరుకుంటే మళ్లీ సీఎంగా రేవంత్‌రెడ్డి అవుతారు.. ఈ వ్యాఖ్యలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు.
ఇది జాతీయ పార్టీ. ఎవరు సీఎం కావాలో అధిష్ఠానం నిర్ణయిస్తుంది. కాంగ్రెస్‌లో ఎవరూ తానే ముఖ్యమంత్రినని చెప్పుకోవడం తీవ్ర అభ్యంతరకరం.. గతంలో తాను మళ్లీ పదేండ్లు సీఎంగా ఉంటానన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు ప్రతిగా చేసిన ఈ వ్యాఖ్యలను గతంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి గమ్యంపై విశ్లేషణాత్మక కథనం.
CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో అంతా గప్‌చుప్ రాజ్యమేలుతుంది. తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీలో తనకు కొంతమంది ప్రత్యర్థులు ఉన్నారన్న భావం నుంచి ప్రత్యర్థులే లేరన్న స్థాయికి సీఎం రేవంత్‌రెడ్డి చేరుకున్నారా? అంతా మేనేజ్ చేసుకున్నారా? ఎవరూ పోటీ లేకుండా సాఫీగా ఫ్యూచర్ రాజకీయాన్ని సుస్థిరం చేసుకున్నారా? అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
CM Revanth Reddy: కాంగ్రెస్ గెలుపొందిన తొలినాళ్లలో సీఎం రేవంత్‌రెడ్డికి పోటీగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పక్కలో బల్లెంగా భావించారని తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎంగా ప్రత్యర్థులపై పైచేయి సాధించగా, ఇతరులపై వీక్ చేసిన రేవంత్‌రెడ్డి మరింత బలోపేతం అయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
CM Revanth Reddy: తానే పదేండ్లు సీఎంగా ఉంటానన్న వ్యాఖ్యలపై ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఆయన ఓ 25 మంది ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపి అసమ్మతికి ఆజ్యం పోస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. కానీ, బహిరంగంగా రాజగోపాల్‌రెడ్డి మినహా మరెవరూ ప్రకటనలు చేసే సాహసం చేయలేకపోయారు.
CM Revanth Reddy: తాజాగా మళ్లీ నేనే సీఎం అన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ చేసే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఏకంగా మద్దతుగా నిలిచినట్టే ప్రకటించారు. దీంతో సీనియర్ మంత్రులు కూడా నోళ్లు తెరిచే సాహసం చేయడం లేదు. గతంలో మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి కూడా ఈసారి నోరు తెరవలేదు. అంటే రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ లీడర్‌గా కాంగ్రెస్‌లో స్థిరపడ్డారా? అంటే నిజమే కావచ్చని వారు విశ్లేషిస్తున్నారు.