Revanth Reddy: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు గణ నాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలుచేసి ఘన వీడ్కోలు పలికారని సీఎం పేర్కొన్నారు. తొమ్మిది రోజులపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, అత్యంత భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర ప్రశాంతంగా సాగడంలో అహర్నిశలు పనిచేసిన పోలీసు, రెవెన్యూ, విద్యుత్, రవాణా, మున్సిపల్, పంచాయతీ రాజ్ పారిశుద్ధ్య, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి, ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహకులు, క్రేన్ ఆపరేటర్లు, భక్తులు అందరికీ సీఎం అభినందనలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Akshay Kumar: ముంబైలోని జుహు బీచ్‌లో.. అక్షయ్ కుమార్ తో మాజీ సీఎం భార్య..
హైదరాబాద్ నగరంలో లక్షలాది విగ్రహాలు క్రమపద్ధతిలో నిర్దేశిత సమయానికి ట్యాంక్‌బండ్‌తో సహా మిగతా అన్ని ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం సాఫీగా, ప్రశాంతంగా సాగడానికి సహకరించిన ప్రజలందరికీ ముఖ్యమంత్రి సీఎం తెలియజేశారు. మరోవైపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు సడలించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ రాకపోకలను పునరుద్ధరించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ, బషీర్‌బాగ్, అసెంబ్లీ, లక్డీకాపూల్ మార్గాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. రహదారులపై పేరుకుపోయిన చెత్తను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు