CM chandrababu: కేంద్ర బడ్జెట్ పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..

Cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రజలకు ఉపయోగకరమైన, ప్రగతిశీల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ విజన్ను ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ రూపొందించబడిందని ఆయన పేర్కొన్నారు.8

ఈ బడ్జెట్‌లో మహిళలు, పేదలు, యువత, రైతులకు ప్రాధాన్యత కల్పించారని, అలాగే వచ్చే ఐదేళ్లలో ఆరు కీలక రంగాల్లో అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించారని చంద్రబాబు వివరించారు.

“దేశ సంక్షేమ దిశగా ఈ బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇది మన దేశ భవిష్యత్‌ను మరింత బలంగా తీర్చిదిద్దే సమగ్ర బ్లూప్రింట్‌గా నిలుస్తుంది. అలాగే, మధ్య తరగతి ప్రజలకు పన్ను ఊరట కల్పించడం ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఈ బడ్జెట్‌ను నేను స్వాగతిస్తున్నాను” అంటూ చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Nadendla manohar: ఇక ప్రతి బియ్యం బస్తాకు క్యూఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *