Chennai: మానవ సేవే మాధవ సేవ అంటారు.. కానీ మానవత్వం కొన్నిసార్లు మంచిదికాదని ఇక్కడ నిరూపితమైంది. చిన్నసాయం కోరిన ఆ యువకుడు.. ఒంటరిగా ఉన్న ఆ యువతిపై కన్నేశాడు.. ఏకంగా లైంగికదాడికి పాల్పడబోయాడు. ప్రతిఘటించిన యువతి కేకలు వేయడంతో ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు.
తమిళనాడు చెన్నైలో ఈ దారుణం చోటుచేసుకున్నది.
Chennai: చెన్నైలో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే ఓ యువతి జెప్టో యాప్‌లో ఆర్డర్ పెట్టింది. ఆర్డర్ చేసిన వస్తువులను జెప్టో డెలివరీ బాయక్ గోపీనాథ్ తీసుకొచ్చాడు. వస్తువులను ఇచ్చిన ఆ యువకుడు.. ఆ యువతి ఒంటరిగా ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టాలని ఆ యువతిని కోరాడు. చిన్నసాయమే కదా.. అని ఆ యువకుడిని ఇంటిలోనికి అనుమతించింది. ఇదే అదునుగా ఆ యువతిపై గోపీనాథ్ లైంగికదాడికి యత్నించాడు.
Chennai: హఠాత్పరిణామంతో అవాక్కైన ఆ యువతి అతనిని ప్రతిఘటిస్తూ గట్టిగా కేకలు వేసింది. దీంతో వెంటనే అక్కడి నుంచి ఆ యువకుడు పరారయ్యాడు. ఆ తర్వాత బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడైన డెలివరీ బాయ్ గోపీనాథ్‌ను అరెస్టు చేశారు.