Salman Khan: బాలీవుడ్ నటుల్లో సూపర్‌స్టార్ అనిపించుకున్న సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువగానే మాట్లాడతారు. అయితే ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో’లో పాల్గొన్న సందర్భంగా ఆయన చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 59 ఏళ్ల వయస్సులోనూ పెళ్లి చేసుకోకపోవడంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెళ్లి అనేది భావోద్వేగాలకు పరీక్ష
సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. పెళ్లి, విడాకులు ఇవన్నీ భావోద్వేగపరంగానూ, ఆర్థికపరంగానూ కష్టం. ఇది ఓ వ్యక్తికి ఎంతగానో బాధ్యతను తెస్తుంది. అందుకే ఇప్పటికీ నేను పెళ్లికి దూరంగా ఉన్నాను అని చెప్పారు.
అనారోగ్య సమస్యలతో పోరాటం
తన ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆయన ఓపెన్‌గా మాట్లాడారు. నాకు ట్రైజెమినల్ న్యూరల్జియా, ఏవీ మాల్ఫోర్మేషన్, బ్రెయిన్ ఎన్యోరిజమ్ లాంటి సమస్యలు ఉన్నాయి. అయినా పని ఆపలేదు. నేను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలని కోరుకుంటా. ఇలాంటి సమస్యలు చిన్నప్పుడే ఉంటే ఇప్పటికి కంట్రోల్ చేసేవాడిని. కానీ ఇప్పుడైనా నేను మళ్లీ నా జీవితాన్ని రీస్టార్ట్ చేసుకుంటున్నా అని చెప్పారు.
నటుడిగా గాయాలే భాగం
సల్మాన్ తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న ఫిజికల్ కష్టాల గురించి మాట్లాడుతూ.. యాక్షన్ సీన్‌లలో గాయాలు అనేవి సర్వసాధారణం. కానీ ప్రేక్షకులకోసం, కథలకోసం నేను ఆ రిస్క్ తీసుకుంటాను. ఇది ఓ నటుడిగా నాకు గర్వకారణం అన్నారు.
ఇది కూడా చదవండి: OG: వీరమల్లు రిలీజ్ తో ఓజికి లైన్ క్లియర్?
ఆమిర్ ఖాన్‌పై అభిమానం
తన స్నేహితుడు ఆమిర్ ఖాన్ గురించి మాట్లాడుతూ అమిర్ ఖాన్ పర్‌ఫెక్షనిస్ట్. ఆయన ప్రేమ విషయాల్లోనూ అదే అద్భుతత చూపుతారు. గౌరీ స్ప్రాట్‌తో ఆయన ప్రేమలో ఉన్నారన్న సంగతి నాకు తెలుసు. ఈసారి తప్పకుండా ఆ బంధంలో పర్‌ఫెక్షన్ సాధిస్తారు అని నమ్మకం ఉంది అని నవ్వుతూ స్పందించారు.
తేరీ నామ్ లుక్‌కి మంత్రముగ్ధం
తన సినీ కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ‘తేరీ నామ్’ సినిమాలో లుక్ గురించి సల్మాన్ చెబుతూ ఆ లుక్‌కి డాక్టర్ అబ్దుల్ కలాం గారు స్ఫూర్తి. వారి హెయిర్‌స్టైల్‌ని చూసే నేను ఆ గెటప్ డిజైన్ చేయించుకున్నా అన్నారు.
సల్మాన్ మాటల్లో స్పష్టత, స్ఫూర్తి
సల్మాన్ ఖాన్ మాటల్లో స్పష్టత ఉంది. జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలి అనే సందేశాన్ని ఆయన మాటలు ఇచ్చాయి. పెళ్లి, ఆరోగ్యం, కెరీర్, స్నేహం అన్ని అంశాల్లోనూ తనదైన స్టైల్‌లో స్పందించిన సల్మాన్ మాటలు అభిమానులను మరోసారి ఆకట్టుకున్నాయి.
