Chalamalla krishna reddy: చందూరు పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ సీనియర్ నేత చలమల కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై తీవ్రంగా స్పందించారు. మంత్రి పదవి పంచాయతీ విషయాన్ని పక్కనపెట్టి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
మంత్రి పదవి కోసం హైకమాండ్‌పై ఒత్తిడి తేవడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. మంత్రి పదవి విషయంలో హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని, విభేదాలు పక్కన పెట్టి సమష్టిగా పని చేస్తేనే కాంగ్రెస్ బలపడుతుందని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అదే పార్టీకి, ప్రజలకు మేలు చేస్తుందని హితవు పలికారు.