pan card

Pan Card: పాన్ కార్డు మారుతోంది.. క్యూఆర్ కోడ్ తో వస్తుంది..

Pan Card: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర  కేబినెట్ సమావేశంలో పాన్ 2.0 ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.1435 కోట్లు వెచ్చించనుందని కేంద్ర మంత్రి అశ్వి వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే ఉన్న పాన్ నంబర్‌ను మార్చకుండా కార్డులు అడ్వాన్స్‌డ్ చేస్తారు. మంత్రి వైష్ణవ్ దీనిపై వివరిస్తూ కొత్త పాన్ కార్డులకు క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీని కోసం, పేపర్‌లేన్ అంటే ఆన్‌లైన్ ప్రక్రియను అవలంబిస్తారు. QR కోడ్‌తో పాన్ కోసం ప్రజలు విడిగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కొత్త పాన్‌లో డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది అని చెప్పారు. 

ఏదైనా ఫిర్యాదును పరిష్కరించడానికి ఫిర్యాదు రిఫరల్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. పాన్ కార్డును ఉమ్మడి వ్యాపార గుర్తింపుగా మార్చడమే తమ ప్రయత్నమని మంత్రి అన్నారు.కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైతుల కోసం జాతీయ సహజ వ్యవసాయ మిషన్, యువత, విద్యార్థుల కోసం ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’, అటల్ ఇన్నోవేషన్ మిషన్ 2.0 అనే మూడు కొత్త ప్రాజెక్టులకు కూడా ఆమోదం లభించిందని ఆయన చెప్పారు.

ఇది కూడా చదవండి: Airtel: టీచర్స్ కోసం ఎయిర్‌టెల్ స్పెషల్ యాప్!

Pan Card: నవంబర్ 6వ తేదీన జరిగిన మోడీ క్యాబినెట్ సమావేశంలో 75% క్రెడిట్‌కు ఆమోదం లభించింది. ఇందులో, ఉన్నత విద్య కోసం 7.5 లక్షల రూపాయల వరకు రుణాలపై భారత ప్రభుత్వం 75% క్రెడిట్ గ్యారెంటీని ఇస్తుంది.రూ.8 లక్షల వార్షికాదాయం ఉన్న కుటుంబాల పిల్లలకు రూ.10 లక్షల వరకు రుణాలపై 3% వడ్డీ రాయితీ కూడా ఇవ్వబడుతుంది. రూ.4.5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న విద్యార్థులు ఇప్పటికే పూర్తి వడ్డీ రాయితీ పొందుతున్నారు.దేశంలోని 860 ప్రధాన ఉన్నత విద్యా కేంద్రాల నుండి 22 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి వస్తారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు చదువుకు డబ్బు ఆటంకం కలగకుండా చేయడమే ఈ పథకం లక్ష్యం అని కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నారు.PM విద్యాలక్ష్మి యోజన అనేది జాతీయ విద్యా విధానం, 2020 పొడిగింపు కార్యక్రమం. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Toll Plaza Information: వామ్మో టోల్ మోత‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *