Operation Sindoor: పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత భారత సైన్యం పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మెరుపుదాడులు జరిపింది. ఈ దాడిలో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. సైన్యం అధికారికంగా ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని ప్రకటించింది.
ఈ ఆపరేషన్ పేరు ‘సింధూర్’కు ప్రత్యేక అర్థం ఉంది. భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకార భావనకు గుర్తుగా, యోధులకు పూయే వీరతిలకానికి ప్రతీకగా ఈ పేరును ఎంపిక చేసినట్టు చెబుతున్నారు.
రాజకీయ నేతల స్పందనలు:
నారా చంద్రబాబు నాయుడు: “జైహింద్” అంటూ భారత సైన్యానికి మద్దతుగా ట్వీట్ చేశారు.
నారా లోకేష్: “జైహింద్… న్యాయం జరిగింది” అంటూ స్పందించారు.
కిషన్ రెడ్డి: “భారత్ మాతాకీ జై… జైహింద్” అంటూ ప్రశంసలు కురిపించారు.
బండి సంజయ్: “పాక్ మూల్యం చెల్లించాల్సిందే… మేరా భారత్ మహాన్” అని ట్వీట్ చేశారు.
అసదుద్దీన్ ఒవైసీ: “పాకిస్తాన్ మరో పహల్గాం జరగకుండా గట్టి గుణపాఠం నేర్పించాలి. ఉగ్ర స్థావరాలను నాశనం చేయాలి. జైహింద్!” అని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు: “జీరో టోలరెన్స్ ఫర్ టెర్రరిజం… భారత్ మాతాకీ జై” అంటూ ట్వీట్ చేశారు.
Also Read: PM Modi: మా నీళ్లు ఇక మాకే సొంతం.. ఎవరికి ఇచ్చేది లేదు
సెలబ్రిటీల స్పందనలు:
ఆనంద్ మహీంద్రా (వ్యాపారవేత్త): “మా ప్రార్థనలన్నీ భద్రతా బలగాలతోనే ఉంటాయి. ఒకే దేశం.. కలిసి నిలబడదాం” అంటూ ట్వీట్ చేశారు.
రితేష్ దేశ్‌ముఖ్ (నటుడు): “జై హింద్ కీ సేనా… భారత్ మాతాకీ జై” అంటూ వ్యాఖ్యానించారు.
ఖుష్బూ (నటి, రాజకీయ నాయకురాలు): “భారత్ మాతాకీ జై… న్యాయం జరిగింది” అంటూ రాసారు.
మధుర్ భండార్కర్ (దర్శకుడు): “భద్రతా బలగాలకు మరింత బలం కలగాలి… వందేమాతరం” అంటూ ట్వీట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ట్వీట్: జై హింద్ ట్వీట్..
సోషల్ మీడియా స్పందన:
సామాజిక మాధ్యమాల్లో #IndiaPakistanWar అని టాప్‌లో ట్రెండ్ అవుతోంది #OperationSindoor హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ప్రజలు భారత సైన్యం తలపెట్టిన ధైర్యవంతమైన చర్యపై గర్వంతో స్పందిస్తున్నారు.
Proud of our Armed Forces. Jai Hind!
— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2025
As an Indian citizen first, standing strongly with our armed forces.
The strikes against terror factories in Pakistan & PoK make us proud.
Let us make this a moment for national solidarity and unity, and all of us speak in one voice – Jai Hind!#OperationSindoor
— Revanth Reddy (@revanth_anumula) May 7, 2025