AP SSC Supplementary Results: ఏపీ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వీటిని ప్రకటించారు. ఈసారి మొత్తం 94,990 మందిలో 78,261 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే పాస్ పర్సంటేజ్ 6.25% పెరిగింది. ప్రభుత్వ ’20 రోజుల యాక్షన్ ప్లాన్’ వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ లేదా 95523 00009 నంబర్ ద్వారా వాట్సాప్‌లోనే తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు.
మరింత AP SSC Supplementary Results: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈసారి 6.25% పెరిగిన పాస్ పర్సంటేజ్..Category: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Delhi High Court:టెలిగ్రామ్‌పై నిషేధాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
Delhi High Court: టెలిగ్రామ్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థిస్తూ ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ పేపర్ లీక్ కాకుండా ముందస్తు జాగ్రత్తగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉందని జస్టిస్ తేజస్ కారియా స్పష్టం చేశారు. ఉగ్రవాదం, సైబర్ నేరాలకు టెలిగ్రామ్ డార్క్ వెబ్‌లా మారుతోందన్న కేంద్రం వాదనతో కోర్టు ఏకీభవించింది.
మరింత Delhi High Court:టెలిగ్రామ్‌పై నిషేధాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టుVijayawada: సాయికృష్ణ కేసులో సంచలనం.. కృష్ణలంక సీఐ నాగరాజుపై ‘మర్డర్’ కేసు నమోదు
Vijayawada: విజయవాడ రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజుపై మర్డర్ కేసు నమోదైంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదును సీపీ రాజశేఖర్‌బాబు స్వయంగా స్వీకరించి, సీఐపై BNS సెక్షన్లు 101(1), 127(4), 127(6) కింద కేసు నమోదు చేయించారు. ఈ లాకప్ డెత్ ఆరోపణల కేసు విచారణ అధికారిగా దిశా పీఎస్ ఏసీపీ దైవ ప్రసాద్ నియమితులయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దర్యాప్తు వేగవంతమైంది.
మరింత Vijayawada: సాయికృష్ణ కేసులో సంచలనం.. కృష్ణలంక సీఐ నాగరాజుపై ‘మర్డర్’ కేసు నమోదుKodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి
Kodali Nani: 2021 పంచాయతీ ఎన్నికల సమయంలో చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో వైకాపా నేత కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో ఆయన మంత్రిగా ఉన్నందున విచారణకు ప్రభుత్వ పర్మిషన్ అవసరమవడంతో మూడేళ్లుగా ఈ కేసు పెండింగ్‌లో ఉంది. తాజాగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అనుమతి ఉత్తర్వులు జారీ చేయడంతో కోర్టులో విచారణ ముందుకు సాగనుంది.
మరింత Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతిMaa Inti Bangaaram: $300K ప్రీ సేల్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సమంత ‘మా ఇంటి బంగారం’
Maa Inti Bangaaram: $300K ప్రీ సేల్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సమంత ‘మా ఇంటి బంగారం’
మరింత Maa Inti Bangaaram: $300K ప్రీ సేల్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సమంత ‘మా ఇంటి బంగారం’Kakinada Child Missing: 500 ఎకరాలు.. థర్మల్ డ్రోన్లు.. 400 మంది సిబ్బంది! తండ్రి విచారణ.. క్లూ ఇస్తుందనుకున్న పెంపుడు కుక్క మృతి!
Kakinada Child Missing: కాకినాడ జిల్లాలో రెండేళ్ల జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు మిస్టరీగా మారింది. తోటలోకి వెళ్లిన పాప కోసం 400 మంది సిబ్బంది, థర్మల్ డ్రోన్లతో 500 ఎకరాల్లో గాలిస్తున్నారు. పాపతో పాటు ఉండి, తిరిగి వచ్చిన పెంపుడు కుక్క కూడా అనుకోకుండా మృతి చెందడం కేసును సందిగ్ధంలో పడేసింది. కుటుంబ కలహాల కోణంలో తండ్రిని విచారిస్తున్న పోలీసులు, జంతువుల దాడి అనుమానంతో స్పై కెమెరాల బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు.
మరింత Kakinada Child Missing: 500 ఎకరాలు.. థర్మల్ డ్రోన్లు.. 400 మంది సిబ్బంది! తండ్రి విచారణ.. క్లూ ఇస్తుందనుకున్న పెంపుడు కుక్క మృతి!TG High Court: రాయదుర్గం భూముల వేలంపై 3 వారాల స్టే.. రంగంలోకి ఎస్‌బీఐ (SBI)!
TG High Court: హైదరాబాద్ పరిధిలోని రాయదుర్గం పరిధిలోని ఐటీ హబ్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన భూముల వేలంపై దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’(SBI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మరింత TG High Court: రాయదుర్గం భూముల వేలంపై 3 వారాల స్టే.. రంగంలోకి ఎస్‌బీఐ (SBI)!Telegram: టెలిగ్రామ్ ఒక ‘కొత్త డార్క్ వెబ్’.. దేశ భద్రతకు పెను ముప్పు..!
Telegram: టెలిగ్రామ్ యాప్ ఒక “కొత్త డార్క్ వెబ్” గా మారిందని, నేరస్థులు, ఉగ్రవాదులు చట్టాల నుండి తప్పించుకోవడానికి దీనిని వాడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఒకే అకౌంట్‌తో 40 బోట్లను సృష్టించే వీలుండటం వల్ల సైబర్ మోసాలు, ఆధార్ వంటి పౌరుల వ్యక్తిగత డేటా లీక్‌లు, పైరసీ, డ్రగ్స్ స్మగ్లింగ్ వేగంగా విస్తరిస్తున్నాయని ఐ4సి నివేదికలను ఉటంకిస్తూ కేంద్రం తన నిషేధ నిర్ణయాన్ని సమర్థించుకుంది.
మరింత Telegram: టెలిగ్రామ్ ఒక ‘కొత్త డార్క్ వెబ్’.. దేశ భద్రతకు పెను ముప్పు..!OG-2: లో రెబల్ స్టార్ ప్రభాస్?.. ‘సాహో’ కనెక్షన్‌తో సుజీత్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..?
OG-2: పవన్ కళ్యాణ్ ‘OG 2’ సీక్వెల్ కన్ఫర్మ్ అవ్వడంతో సోషల్ మీడియాలో భారీ బజ్ నెలకొంది. డైరెక్టర్ సుజీత్ విదేశాల నుండి వచ్చాక కథా చర్చలు జరగనున్నాయి, నవంబర్ తర్వాత షూటింగ్ ఉండొచ్చు. అయితే ‘OG’ లోని సాహో కనెక్షన్ వల్ల పవన్, ప్రభాస్ ఒకే సినిమాలో కనిపిస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. సుజీత్ మొదట నాని ‘బ్లడీ రోమియో’ పూర్తి చేసి దీనిపైకి వచ్చే అవకాశం ఉంది.
మరింత OG-2: లో రెబల్ స్టార్ ప్రభాస్?.. ‘సాహో’ కనెక్షన్‌తో సుజీత్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..?Shubman Gill: కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్!
Shubman Gill: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. గిల్ (154), ఇషాన్ కిషన్ (125) రాణించడంతో భారత్ 402 పరుగులు చేసింది. వన్డేల్లో 8వ సారి 400+ స్కోరు చేసి సౌతాఫ్రికా రికార్డును భారత్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో గిల్ వన్డేల్లో 3000 పరుగులు పూర్తి చేసి, అత్యంత వేగంగా (62 ఇన్నింగ్స్‌ల్లో) ఈ మైలురాయిని దాటిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే బంతుల పరంగా కపిల్ దేవ్ రికార్డును 21 బంతుల తేడాతో మిస్ చేసుకున్నాడు.
మరింత Shubman Gill: కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన శుభ్‌మన్!