Bullet Trains: 

Bullet Trains: గంటకు 350 కిలోమీటర్ల స్పీడ్.. జపాన్ కి పోటీ ఇయ్యనునా భారత్ బుల్లెట్ ట్రైన్

Bullet Trains: దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ (బుల్లెట్ రైలు) ప్రాజెక్టు పట్టాలపైకి వచ్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సుమారు రూ. 2 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ రూట్‌లో రెండు దశల్లో బుల్లెట్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆగస్టు 2027 నాటికి ఈ మార్గంలో తొలి బుల్లెట్ రైలు సర్వీసును ప్రారంభించేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే కేవలం ఇతర దేశాల నుంచి రైళ్లను దిగుమతి చేసుకోవడమే కాకుండా.. సొంతంగా దేశీయ పరిజ్ఞానంతోనే (మేడ్ ఇన్ ఇండియా) బుల్లెట్ రైళ్లను తయారు చేసేందుకు భారత్ భారీ కార్యాచరణను సిద్ధం చేయడం విశేషం.

ముంబై-అహ్మదాబాద్ మార్గంలో మొదటగా B28 సిరీస్ రైళ్లు..

గరిష్ఠ వేగం..
ఈ కారిడార్‌లో తొలుత B28 సిరీస్ హైస్పీడ్ రైళ్లను నడపనున్నారు. ఈ రైలు గరిష్ఠ వేగం గంటకు 280 కిలోమీటర్లు కాగా, కార్యాచరణ (ఆపరేషనల్) వేగం గంటకు 249 కిలోమీటర్లుగా ఉండనుంది.
BEMLకు తయారీ కాంట్రాక్ట్..
దేశీయంగా 32 B28 సిరీస్ రైళ్లను తయారు చేసే బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) దక్కించుకుంది. భారత బుల్లెట్ రైలు ట్రాక్‌లపై దేశీయంగా రూపుదిద్దుకున్న రైళ్లే పరుగులు తీయనున్నాయి. రైళ్ల తయారీతో పాటు వాటి ఆధునిక కంట్రోలింగ్ వ్యవస్థలను కూడా భారత్ సొంతంగా అభివృద్ధి చేస్తోంది.
2030 నాటికి 350 కి.మీ వేగంతో దూసుకెళ్లే B35 రైళ్లు..
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదనల ప్రకారం.. 2030 నాటికి మరింత వేగవంతమైన స్వదేశీ బుల్లెట్ రైళ్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

జపాన్ సరికొత్త సిరీస్‌కు భారత్ పోటీ..
ఈ ప్రాజెక్టు కింద తీసుకురానున్న B35 రైళ్లు గంటకు ఏకంగా 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. జపాన్ ప్రస్తుతం వాడుకలో ఉన్న E5 సిరీస్ తయారీని నిలిపివేసి, 2030 నాటికి E10 సిరీస్ బుల్లెట్ రైళ్ల తయారీని ప్రారంభించి 2034 నాటికి పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో జపాన్‌కు చెందిన E10 సిరీస్ అత్యాధునిక రైళ్లకు భారత్ రూపొందిస్తున్న B35 బుల్లెట్ రైళ్లు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.
ప్రాజెక్టు ప్రస్తుత స్థితి – సవాళ్లు..

2015లో ప్రారంభమైన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ భూసేకరణ సమస్యలు, అత్యాధునిక టర్బైన్ యంత్రాల రాకలో జాప్యం కారణంగా మొదట నిర్దేశించుకున్న డెడ్‌లైన్ కంటే ఆలస్యమైంది. అలాగే ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా దాదాపు రెట్టింపై రూ.2 లక్షల కోట్లకు చేరింది. అయితే ఈ అడ్డంకులన్నింటినీ అధిగమిస్తూ ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతుండటంతో 2027 ఆగస్టు నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు పరుగులు తీయడం ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *