AP SSC Supplementary Results: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎదురుచూపులు ముగిశాయి. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఫలితాలను ప్రకటిస్తూ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు, శ్రమించిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ఈ ఏడాది సప్లిమెంటరీ ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం విశేషం.
రికార్డు స్థాయిలో పెరిగిన ఉత్తీర్ణత శాతం..
ఈ ఏడాది జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 94,990 మంది విద్యార్థులు హాజరు కాగా.. వారిలో 78,261 మంది సగర్వంగా ఉత్తీర్ణత సాధించారు.
గత ఏడాది సప్లిమెంటరీ పాస్ పర్సంటేజ్ 76.14 శాతంగా ఉండగా.. ఈసారి అది ఏకంగా 6.25 శాతం మెరుగుపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యా ప్రమాణాలకు, విద్యార్థుల అంకితభావానికి ఈ ఫలితాలే నిదర్శనమని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
ఫలితాలను ఆన్లైన్లో ఇలా చెక్ చేసుకోండి:
విద్యార్థులు తమ మార్కులను సులభంగా డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వ పరీక్షల విభాగం (BSEAP) ప్రత్యేక లింకులను అందుబాటులో ఉంచింది.
-
మొదట అధికారిక వెబ్సైట్
www.results.bse.ap.gov.inను సందర్శించాలి. -
హోమ్ పేజీలో కనిపించే ‘AP SSC Advanced Supplementary Results’ లింక్‌పై క్లిక్ చేయాలి.
-
మీ పదో తరగతి సప్లిమెంటరీ హాల్ టికెట్ నంబర్‌ను అక్కడ నమోదు చేయాలి.
-
సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయగానే మీ సబ్జెక్టుల వారీ మార్కుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం దీనిని ప్రింట్ అవుట్ లేదా పీడీఎఫ్ (PDF) రూపంలో సేవ్ చేసుకోవడం మంచిది.
ఈజీగా.. వాట్సాప్ (WhatsApp) ద్వారా ఫలితాలు:
వెబ్సైట్ సర్వర్ బిజీగా ఉంటే.. విద్యార్థులు తమ మొబైల్ నుండే వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు.
-
మీ మొబైల్లో
95523 00009నంబర్‌ను సేవ్ చేసుకోండి. -
వాట్సాప్‌లోకి వెళ్లి ఈ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపండి.
-
అక్కడ వచ్చే మెనూలో ‘Education Services’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
-
ఆ తర్వాత ‘డౌన్లోడ్ SSC సప్లిమెంటరీ ఫలితాలు’ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
-
మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు.. మీ మార్కుల మెమో వెంటనే డిస్ ప్లే అవుతుంది.
సత్ఫలితాలనిచ్చిన ప్రభుత్వ ‘20-డే యాక్షన్ ప్లాన్’..
సాధారణంగా సప్లిమెంటరీ పరీక్షల్లో ఈ స్థాయి ఉత్తీర్ణత నమోదు కావడం వెనుక ఏపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధే ప్రధాన కారణమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. రెగ్యులర్ పరీక్షల్లో తప్పిన వెనుకబడిన విద్యార్థుల కోసం విద్యాశాఖ ప్రత్యేకంగా ’20 రోజుల యాక్షన్ ప్లాన్’ (20-Day Action Plan) అమలు చేసింది. దీని ద్వారా విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వడమే కాకుండా, ఉపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని వారిలో పరీక్షల భయాన్ని పోగొట్టారు. ఈ అకడమిక్ సపోర్ట్ వల్లే విద్యార్థులు తమ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా పైచదువులకు సిద్ధమయ్యారు.
