virat kohli

Virat Kohli: దూకుడు తగ్గిస్తేనే టెస్టుల్లో కోహ్లి హిట్..బ్రాడ్ హాగ్ సూచన

Virat Kohli: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా  స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పెద్దగా ప్రభావం చూపించలేదు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్సులో వర్షం ప్రభావం కారణంగా ఇబ్బంది పడ్డాడని భావిస్తే.. రెండో టెస్టులోనూ అదే పునరావృతమైంది. కీలకమైన సమయంలో వికెట్‌ను సమర్పించుకొని విఫలమయ్యాడు. మరీ ముఖ్యంగా స్పిన్నర్లకు వికెట్లను ఇచ్చేయడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. దూకుడుగా ఆడేద్దామనే భావనతో ఔట్‌ అవుతున్నట్లు ఆసీస్‌ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ వెల్లడించాడు. కోహ్లీ తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నాడని హాగ్ వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ ప్రత్యర్థి బౌలింగ్‌ను తక్కువగా అంచనా వేశాడు. షాట్లు కొట్టేటప్పుడు భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయినట్లు అనిపిస్తోందన్నాడు. కోహ్లీ  టెక్నిక్‌ను మరింత మెరుగుపర్చుకోవాలని హాగ్ సూచిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: IPL 2025 Auction: ఐపీఎల్లో ఖరీదైన ఆటగాళ్లు వీరే…

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *