Rohan Bopanna: ప్రతిష్టాత్మక ఏటీపీ ఫైనల్స్ కు లో భారత స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న- ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్ జోడీ అర్హత సాధించింది. రోలెక్స్ పారిస్ మాస్టర్స్ నుంచి నాథనీల్ లామోన్స్- జాక్సన్ విత్రో జంట నిష్క్రమించడంతో బోపన్న- ఎబ్డెన్ జోడీకి ఏటీపీ ఫైనల్స్‌లో చోటు ఖాయమైంది. నవంబరు 10 నుంచి 17 వరకు ఇటలీలో జరిగే సీజన్ ఆఖరి టోర్నీలో ప్రపంచంలోని ఎనిమిది అత్యుత్తమ డబుల్స్ జోడీలు బరిలో దిగుతాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన బోపన్న- ఎబ్డెన్ జోడీ.. మియామీ టైటిల్ గెలుచుకుంది. అడిలైడ్‌లో ఫైనల్, రోలాండ్ గ్యారోస్‌లో సెమీస్ చేరుకుంది. ఈ ప్రదర్శనతో వరుసగా రెండో ఏడాది ఏటీపీ ఫైనల్స్‌కు బోపన్న- ఎబ్డెన్ జంట అర్హత సాధించింది.
ఇది కూడా చదవండి: Virat Kohli: దూకుడు తగ్గిస్తేనే టెస్టుల్లో కోహ్లి హిట్..బ్రాడ్ హాగ్ సూచన