IPL 2025 auction

IPL 2025 Auction: ఐపీఎల్లో ఖరీదైన ఆటగాళ్లు వీరే…

IPL 2025 Auction: మెగా వేలం వేళ.. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు ఎవరు..? వారి ప్రైస్ ఎంత వారి వివరాలు ఏంటి..2024 సీజన్‌ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మిచెల్ స్టార్క్ ను రూ. 24.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో ఓ ఆటగాడికి చెల్లించిన అత్యధిక ధర ఇదే. మరి అత్యంత ఖరీదైన ఆటగాళ్ల వివరాలు చూడాలంటే వాచ్ దిస్ స్టోరీ..

ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాల తయారీలో ఫ్రాంచైజీలన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి. ఎవరిని జట్టులో కొనసాగించాలి. ఎవరిని వేలంలోకి వదిలేయాలన్న లెక్కలతో ఐపీఎల్ జట్లన్నీ కుస్తీ పడుతున్నాయి. కాగా, ఈ ఏడాది ఫ్రాంచైజీలు తమతమ రిటెన్షన్‌ జాబితాలను సమర్పించడానికి అక్టోబర్‌ 31 చివరి తేదీ. ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకునే క్యాప్డ్‌ ప్లేయర్లకు ఛాయిస్‌ ప్రకారం వరుసగా 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రిటైన్‌ చేసుకునే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్‌-2025 వేలం నవంబర్‌ 25 లేదా 26 తేదీల్లో రియాద్‌లో జరగవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Omelette: 24 క్యారెట్ల బంగారు పూత పూసిన ఆమ్లెట్ తిన్నారా

IPL 2025 Auction: గతంలో జరిగిన మినీ వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ 24.75 కోట్లకు స్టార్క్ ను కొనుగోలు చేయగా.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అదే సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పాట్‌ కమిన్స్ ను రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్‌ చరిత్రలో రెండో భారీ ధర. స్టార్క్‌, కమిన్స్‌ తర్వాత ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ ఐపీఎల్‌లో అత్యంత భారీ ధరను దక్కించుకున్నాడు. కర్రన్‌ను 2023 సీజన్‌లో వేలంలో పంజాబ్‌ కింగ్స్‌ రూ. 18.5 కోట్లకు సొంతం చేసుకుంది.

ఆర్సీబీ  కామెరూన్ గ్రీన్ రూ. 17.50 కోట్లు, సీఎస్ కే బెన్‌ స్టోక్స్‌ ను  రూ. 16.25 కోట్లు2021లో  రాజస్థాన్ రాయల్స్ క్రిస్‌ మోరిస్‌ ను  రూ. 16.25 కోట్లు2015లో యువరాజ్ సింగ్ ను రూ.16 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్,   లక్నో నికోలస్ పూరన్ ను  రూ. 16 కోట్లు, 2020లో కేకేఆర్ ప్యాట్ కమ్మిన్స్ రూ. 15.50 కోట్లకు కేకేఆర్, 2022లో ముంబై ఇండియన్స్ జట్టు ఇషాన్ కిషన్ కోసం రూ.15.25 కోట్లు చెల్లించింది. వీరే ఐపీఎల్ లో టాప్ 10 ఖరీదైన ఆటగాళ్లు.

ALSO READ  IND vs SA: సఫారీ సిరీస్ మనదేనా..?

IPL 2025 Auction: సీజన్ల వారీగా ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు గా నిలిచిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. 2008 ఏడాదిలో ఎంఎస్‌ ధోని రూ. 9.5 కోట్లు, 2009 ఏడాదిలో ఆర్సీబి తరఫున కెవిన్‌ పీటర్సన్‌, సీఎస్కే తరఫున ఆండ్రూ ఫ్లింటాఫ్‌ రూ. 9.8 కోట్లు, 2010 ఏడాదిలో  షేన్‌ బాండ్‌ కేకేఆర్‌ తరఫున, కీరన్‌ పోలార్డ్‌ ముంబై ఇండియన్స్‌  తరఫున రూ. 4.8 కోట్లు, 2011 ఏడాదిలో  గౌతమ్‌ గంభీర్‌ కేకేఆర్‌ తరఫున రూ. 14.9 కోట్లు, 2012 ఏడాదిలో రవీంద్ర జడేజా సీఎస్‌కే తరఫున  రూ. 12.8 కోట్లు, 2013 ఏడాదిలో గ్లెన్‌ మ్యాక్స్ వెల్ ముంబై ఇండియన్స్‌ తరఫున రూ. 6.3 కోట్లుఆర్సీబీ తరఫున 2014 ఏడాదిలో యువరాజ్ సింగ్ రూ.14 కోట్లు వేలంలో అత్యధిక ధర పలికారు.

2015లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున యువరాజ్ రూ.16 కోట్లు, 2016 ఏడాదిలో ఆర్సీబి తరఫున షేన్ వాట్సన్ రూ. 9.5 కోట్లు, 2017 ఏడాదిలో బెన్ స్టోక్స్ రైజింగ్ పుణె జెయింట్స్ తరఫున రూ. 14.5 కోట్లు, 2018 ఏడాదికి రాజస్థాన్ రాయల్స్ తరఫున రూ. 12.5 కోట్లు, 2019 ఏడాదికి గాను జైదేవ్ ఉదక్కత్ రాజస్థాన్ కు, వరుణ్ చక్రవర్తి పంజాబ్ జట్టు తరఫున రూ. 8.4 కోట్లు, 2020 ఏడాదికి పాట్‌ కమిన్స్‌ కేకేఆర్‌ తరఫున  రూ. 15.5 కోట్లు, 2021 ఏడాదిలో  క్రిస్‌ మోరిస్‌ రాజస్థాన్ తరఫున రూ. 16.25 కోట్లు, 2022 ఏడాదిలో ఇషాన్‌ కిషన్‌ ముంబై ఇండియన్స్‌ తరఫున రూ. 15.25 కోట్లు,2023 ఏడాదిలో సామ్‌ కర్రన్‌ పంజాబ్‌ కింగ్స్‌ తరఫున రూ. 18.5 కోట్లు,2024- మిచెల్‌ స్టార్క్‌ కేకేఆర్‌ తరఫున- రూ. 24.75 కోట్లతో  ఆ సీజన్ కు అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా నిలిచారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *