Crime News

Crime News: ప్రియురాలి పై కత్తితో దాడి చేసిన ప్రియుడు..ఒంటిపై 20 కత్తిపోట్లు..

Crime News: ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ హింసాత్మక ఘటనలో గాయపడిన మహిళ, ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే మరణించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే – నందిగామకు చెందిన స్రవంతి అనే మహిళ, అచ్చిపెద్ద నరసింహారావుతో (పెద్దబాబు) గత కొన్ని నెలలుగా సహజీవన సంబంధంలో ఉండింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ జంట మధ్య తరచుగా వివాదాలు తలెత్తుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఇటీవల పెద్దబాబు ఆమె నివాసానికి వచ్చి డబ్బుల విషయంలో గొడవపడ్డాడు.

ఇది కూడా చదవండి: Telangana: ఇల్లు రాలేదని పురుగులమందు తాగిన యువకుడు..

వాగ్వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో, ఆవేశానికి గురైన పెద్దబాబు కత్తితో స్రవంతిపై దాడికి పాల్పడ్డాడు. పోలీసుల ప్రకారం, స్రవంతి శరీరంపై దాదాపు 20కన్నా ఎక్కువ కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు.

ఈ దృశ్యం చూసిన ఆమె కుమారుడు వెంటనే స్పందించి, తల్లిని ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. అక్కడ వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందించినా, పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడకు రిఫర్ చేశారు. అయితే ఆమె మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచింది.

ఇదిలా ఉండగా, నిందితుడైన పెద్దబాబు నందిగామ మున్సిపల్ కౌన్సిలర్ భర్తగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి విషయాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.

WordsCharactersReading time

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AP DSC-2025 Notification: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఆ తేదీలు మరిచిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *