The Paradise

The Paradise: ‘ది పారడైజ్’లో బాలీవుడ్ విలన్!

The Paradise: న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్-3’ మే 1న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాని రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా కనిపించనున్నాడు. అయితే, ‘హిట్-3’ హడావిడి మధ్యలోనే నాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’ను ప్రకటించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు.

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో రూపొందనున్న ‘ది పారడైజ్’లో నాని సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. ఈ చిత్ర షూటింగ్ మే 2 నుంచి ప్రారంభం కానుంది, నాని మే మధ్యలో జాయిన్ కానున్నాడు. ఈ సినిమాకు హైలైట్‌గా బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ విలన్‌గా ఎంపికైనట్లు సమాచారం. ‘కిల్’ మూవీతో ఆకట్టుకున్న రాఘవ్ ఇప్పుడు నానితో తలపడనున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చగా, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gangster Suicide: ఢిల్లీ జైలులో గ్యాంగ్‌స్టర్ సూసైడ్.. మానసిక ఒత్తిడే కారణమా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *