Best Oil For Baby Massage

Best Oil For Baby Massage: చలికాలంలో పిల్లలకు ఈ నూనెలతో మసాజ్ చేస్తే మంచి ఫలితాలు..

Best Oil For Baby Massage: వంట నూనె లేదా ఇతర చర్మ సంరక్షణ నూనెలు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. కొబ్బరినూనె కాకుండా చర్మ సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని నూనెలను ఉపయోగిస్తారు. చలికాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం సవాలే. కాబట్టి పెద్దలకే కాదు, అప్పుడే పుట్టిన పిల్లలు ఉన్న ఇళ్లలో కూడా నూనెతో మసాజ్ చేయడం వల్ల శిశువు చర్మం, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

చలి నుండి శిశువును రక్షించడానికి సరైన నూనెను ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా అవుతుంది. కాబట్టి శీతాకాలంలో ఏ నూనెను ఉపయోగించడం మంచిది? శిశువులకు మసాజ్ చేయడానికి ఏది అనుకూలంగా ఉంటుంది?అనేది ఇప్పుడు తెలుసుకందాం..

కొబ్బరి నూనె:
ఈ నూనె చాలా తేలికగా ఉంటుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మ వ్యాధుల నుండి రక్షిస్తుంది. చలికాలంలో ఇది చర్మానికి తేమను అందించి దురదను తగ్గిస్తుంది.

మస్టర్డ్ ఆయిల్:
ఆవనూనె చల్లని వాతావరణంలో వేడి చేయడానికి చాలా మంచిదని భావిస్తారు. ఇది కండరాలను బలపరిచి.. శిశువు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శీతాకాలంలో చలి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇది సాంప్రదాయమైన చక్కటి ఎంపిక.

ఇది కూడా చదవండి: Vitamin D deficiency: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా ? జాగ్రత్త

ఆల్మండ్ ఆయిల్:
ఈ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది శిశువు చర్మానికి తేమను, పోషణను అందిస్తుంది. కండరాలను బలోపేతం చేయడంతో పాటు ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది తేలికగా ఉండటమే కాకుండా చర్మానికి పూర్తిగా సురక్షితం.

ఆలివ్ ఆయిల్:
ఈ నూనె చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి చర్మానికి పోషణనిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేయడంతోపాటు చలికాలంలో పొడిబారడం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. ఈ నూనె కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది.

పటిక:
ఎముకలు, కండరాల పెరుగుదలకు పటిక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నందున ఎలాంటి చర్మ సమస్యనైనా నివారిస్తుంది. కాబట్టి అప్పుడే పుట్టిన బిడ్డకు పటిక మసాజ్ ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Vomiting Tips: ప్రయాణం చేసేటప్పుడు వాంతులు అవుతున్నాయా.. ఈ టిప్స్ మీ కోసమే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *