BJP MLA: కర్ణాటక మాజీ మంత్రి, రాజరాజేశ్వరి నగర్ ఎమ్మెల్యే, బీజేపీ నేత మునిరత్న నాయుడిపై కోడిగుడ్ల దాడి జరిగిన సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యి ఇటీవల బెయిల్ మీద విడుదలైన మునిరత్న, అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మినగర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమం ముగిసిన తర్వాత మునిరత్న తిరిగి వెళ్తుండగా, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి.
పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ దాడిపై మునిరత్న మాట్లాడుతూ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆయన తమ్ముడు తనపై దాడి చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.