Turmeric Face Pack: మహిళలు తమ జుట్టును పొడవుగా, ఒత్తుగా, అందంగా మార్చుకోవడంతో పాటు చర్మంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. గ్లోయింగ్ స్కిన్ పొందడానికి అమ్మాయిలు అనేక రకాల హోం రెమెడీలను వాడుతుంటారు. మీరు కూడా ఈ విధంగా హోం రెమిడీలను ఇంట్లోనే ఉన్న కొన్ని పదార్థాలను తయారుచేసుకుని వాడవచ్చు. కస్తూరి పసుపును కూడా హోం రెమెడీగా ఉపయోగించవచ్చు. కస్తూరి పసుపు చర్మానికి చాలా మేలు చేస్తుంది. దీంతో ముఖం కాంతివంతంగా తయారవుతుంది. కస్తూరి పసుపుతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
1) కస్తూరి, పసుపు,పెరుగుతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి ?
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక చెంచా కస్తూరి పసుపు పొడి, అర చెంచా పెరుగు, ఒక చెంచా తేనె అవసరం అవుతాయి. వీటన్నింటినీ కలిపి పేస్ట్ లా చేసి ముఖం మెడపై అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై 15 నిమిషాలు ఉంచిన తరువాత కడిగేయాలి. అనంతరం ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు కూడా ఉపయోగించవచ్చుది. గ్లోయి. దీనిని తరుచుగా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పసుపులో ఉండే పోషకాలు ముఖంపై మచ్చలను తొలగిస్తాయి. అంతే కాకుండా ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి.
2) కస్తూరి పసుపు, పచ్చి పాలతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి ?
ఈ ఫేస్ ప్యాక్ తయారుచేయడానికి ఒక చెంచా కస్తూరి పసుపు, ఒక చెంచా పచ్చి పాలు, ఒక చెంచా కొబ్బరి నూనె అవసరం. ఈ అన్ని పదార్థాలను మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసి, ఆపై ముఖం మెడపై అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత ప్యాక్‌ను కడగాలి. ఆ తర్వాత, మాయిశ్చరైజర్ లేదా ఫేస్ సీరమ్ అప్లై చేయండి. మీకు డ్రై స్కిన్ ఉంటే ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత చర్మం తేమగా ఉంటుంది. మీరు ఈ ప్యాక్‌ని వారానికి రెండు లేదా మూడు సార్లు వాడవచ్చు.
3) మెరిసే చర్మం కోసం కస్తూరి పసుపుతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి ?
మెరిసే చర్మం పొందడానికి, ఒక చెంచా కస్తూరి పసుపు పొడి, ఒక చెంచా చందనం పొడి, తాజా టమోటా రసం అవసరం. వీటన్నిటిని కలిపి పేస్ట్ లా తయారుచేయండి. తర్వాత మీ ముఖం మెడపై 15 నిమిషాల పాటు అప్లై చేయండి. ఆరిన తర్వాత కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ ప్యాక్‌ని వారానికి రెండు లేదా మూడు సార్లు వాడవచ్చు. వీటిని తరుచుగా వాడటం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.