Chapati For Weight Loss: పొట్ట, లావు తగ్గడానికి చాలా మంది అన్నం తినడం మానేసి చపాతీ తినడం మొదలు పెడుతుంటారు. అయితే క్యాలరీల విషయానికి వస్తే అన్నం, చపాతీల మధ్య అంత పెద్ద తేడా ఉండదన్నది నిజం. బరువు తగ్గాలి అంటే కేలరీలు బర్నింగ్ అవుతాయి. అందుకు చాలా వ్యాయామం, నడక చాలా ముఖ్యం. మీ భోజనంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోబయోటిక్ ఆహారాలు ఉండాలి. కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తక్కువగా తీసుకుంటే, ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకుంటే ఆకలి వేస్తుంది. అప్పుడు బరువు తగ్గడం సులభం అవుతుంది.
చపాతీకి బరువు తగ్గడానికి ఎలాంటి సంబంధం లేదు. అన్నం తినడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు. చపాతీ తింటే బరువు తగ్గుతారని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది నిజం కాదు. ఎందుకంటే చపాతీల తయారీకి ఉపయోగించే గోధుమపిండి, అన్నంలోని కార్బోహైడ్రేట్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి మనం అన్నం లేదా చపాతీ ఏది తిన్నా మన శరీరానికి కార్బోహైడ్రేట్లు అందుతాయి. కానీ కొవ్వులు, ప్రోటీన్లతో పాటు కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలు మితంగా తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: Cholesterol Control Fruit: పండు కాదు, అమృతం.. రోజూ తింటే కొలెస్ట్రాల్ కంట్రోల్
Chapati For Weight Loss: సమతుల్య ఆహారంతో పాటు మనం ఎన్ని కేలరీలు తింటున్నామో, ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తున్నామో తెలుసుకోవడం ముఖ్యం. అయినప్పటికీ, చాలా మంది వాస్తవానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటారు. దీంతో మిగిలిన కేలరీలు కొవ్వుగా మారుతాయి. దీని వల్ల బరువు పెరుగుతారు.
మనం తినే ఆహారం ద్వారా లభించే కేలరీలను బర్న్ చేయడానికి ప్రయత్నించాలి. మీరు రోజూ 2000 కేలరీలు తింటే, మీరు 200 నుండి 300 కేలరీలు బర్న్ చేయాలి. దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. మనం ఆహారంలో అన్నం తింటున్నామా, చపాతీ తిన్నామా అన్నది ముఖ్యం కాదు. మనం ఎన్ని కేలరీలు తింటున్నామన్నదే ముఖ్యం. శారీరక శ్రమ ఎక్కువగా చేయని వారు మితంగా తినాలి. దానితో వ్యాయామం చేస్తే బరువు తగ్గవచ్చు.