Hyderabad: తెలుగు సినీ పెద్దలు ప్రభుత్వంతో మీయిటింగ్ కావడంపై సోషల్ మీడియా వ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే హీరో నాగార్జునపై ఎక్కువ చర్చ నడుస్తుంది. నాగార్జున సీఎం రేవంత్ రెడ్డి ని ఏం అడిగాడని హాట్ టాపిక్ గా మారింది. అయితే భేటీలో ఇండస్ట్రీకి సంబంధించి నాగార్జున పలు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తుంది. యూనివర్సల్ లెవల్‌లో స్టూడియో సెటప్ ఉండాలని.. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటీవ్స్ ఇస్తేనే పరిశ్రమ ఎదుగుతుందని.. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావలన్నది మా కోరిక అని నాగార్జున తెలిపినట్లు సమాచారం.
కాగా నాగార్జున పైనే ఎందుకు చర్చ నడుస్తుంది అంటే.. అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుల్చివేసిన విషయం తెలిసిందే. హైడ్రా కూల్చివేతలో భాగంగా.. చెరువును కబ్జా చేశారంటూ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చారు. అయితే దీనిపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు కూడా వేశారు.