Jai Hanuman: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సృష్టించిన ‘హను మాన్’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్’ కోసం అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ భాగస్వామ్యం కానుందని సమాచారం. ఆయన సమర్పణలో ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ భారీ అడుగుతో ‘జై హనుమాన్’ స్కేల్ మరింత పెరిగింది. షూటింగ్ త్వరలో పూర్తి ఊపులో మొదలుకానుంది. ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో ఈ సినిమా మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ బిగ్ అప్‌డేట్‌తో అందరి దృష్టి ‘జై హనుమాన్’పైనే ఉంది.