PM Kisan: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భాగల్పూర్ చేరుకుని, కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడతను విడుదల చేశారు. దీని ద్వారా 9.8 కోట్ల మంది రైతులకు రూ.22,000 కోట్లు బ్యాంకు ఖాతాలకు చేరాయి. ఈ కార్యక్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ మాటల్లో:
- దేశ అభివృద్ధికి పేదలు, రైతులు, మహిళలు, యువత నాలుగు బలమైన స్తంభాలు అని అన్నారు.
- ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యత రైతుల సంక్షేమం కోరుతుంది అని తెలిపారు
- మహాశివరాత్రి సమయానికి రైతులకు ఆర్థిక సహాయం అందజేయడం పూర్వజన్మ సుకృతం.
ప్రధాని అభిమానిగా హనుమంతుడిగా మారిన వ్యక్తి!
బీహార్‌కు చెందిన శ్రావణ్ షా అనే వ్యక్తి, ప్రధాని మోదీపై భక్తితో తనను తాను హనుమంతుడిగా ప్రకటించుకున్నాడు. 2015 నుంచి ప్రతి మోదీ సమావేశానికి హాజరవుతూ, అవసరమైతే అప్పు తీసుకుని వెళ్లేంత ప్రేమ చూపిస్తున్నాడు.
కార్యక్రమంలో వివాదం
భాగల్పూర్ కార్యక్రమంలో డీడీసీ ప్రదీప్ కుమార్ సింగ్ మరియు జేడీయూ నాయకురాలు అర్పణ కుమారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Seethakka: పనిచేసే ప్రభుత్వానికే పట్టం గట్టండి