Students Suicide

Students Suicide: ఇద్దరు విద్యార్థులు.. రెండు గంటల వ్యవధి.. ఆత్మహత్యల కలకలం

Students Suicide: బుధవారం కోటలో 2 గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో ఒక విద్యార్థి, ఒక విద్యార్థిని ఉన్నారు. అమ్మాయి నీట్‌కు ప్రిపేర్ అవుతుండగా, అబ్బాయి జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడు. విశేషమేమిటంటే విద్యార్థులిద్దరూ జవహర్ నగర్ ప్రాంతంలోనే నివసిస్తున్నారు. ప్రస్తుతం ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
6 నెలల క్రితం కోటకు వచ్చి నీట్‌కు సిద్ధమవుతున్న విద్యార్థిని అఫ్షా షేక్ (23) ఉదయం 10 గంటల సమయంలో పీజీ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతీక్షా రెసిడెన్సీలో నివసిస్తోంది. ఈ వీసీహయంపై సీఐ రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ- అఫ్షా గుజరాత్‌లోని అహ్మదాబాద్ నివాసి. ఆమె 6 నెలల క్రితం కోటకు వచ్చింది. బుధవారం ఉదయం పీజీ యాజమాన్యం విద్యార్థిని గదిలో ఉరివేసుకుని ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Elephant Attack: అడవి ఏనుగు బీభత్సం.. ఒకరి మృతి!

రెండు గంటల వ్యవధిలో..
మరో సంఘటనలో మధ్యాహ్నం 12 గంటలకు జేఈఈకి సిద్ధమవుతున్న విద్యార్థి పరాగ్ (18) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను అస్సాం నివాసి. సమాచారం ప్రకారం, అతనికి వచ్చే వారం JEE-మెయిన్ పేపర్ ఉంది.
పరాగ్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహావీర్ నగర్‌లోని నిధి రెసిడెన్సీలో ఇతను నివసిస్తున్నాడు. ప్రస్తుతం అతని న తల్లి కూడా కోటాలో ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఎంబీఎస్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Crime News: నాలుగు రోజుల్లో పెళ్లి.. పోలీసుల ముందే కూతురిని కాల్చి చంపించిన తండ్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *