Bank:మీకు బ్యాంకు లావాదేవీలకు అత్యవసరం ఉన్నదా? రేపో, ఎల్లుండో చూసుకుందాం అనుకుంటున్నారా? అలా అయితే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే. లేదంటే ఈ రోజే అంటే మార్చి 21న లావాదేవీలను పూర్తి చేసుకోండి. ఇదేంటి అనుకుంటున్నారా? అవునండి మార్చి నెలలో చివరివారంలో బ్యాంకులకు నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. అందుకే అత్యవసరమైతే త్వరపడండి. లేదనుకుంటే ఓ నాలుగైదు రోజులు ఆగండి.
Bank:మార్చి నెలలో 22వ తేదీన నాలుగో శనివారం, 23న ఆదివారం కావడంతో రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. అదే విధంగా 24, 25 తేదీల్లో బ్యాంకుల సమ్మె ఉన్నది. బ్యాంకు ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీతో అసోసియేషన్ సమ్మెకు దిగాలని బ్యాంకు యూనియన్లకు పిలుపునిచ్చారు. ఈ రెండురోజుల పాటు బ్యాంకుల సమ్మెతో భారత ఆర్థిక రంగం స్తంభించిపోనున్నది.
Bank:ఈ సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటు ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు, సిబ్బంది కూడా పాల్గొననున్నారు. అయితే బ్యాంకుల సమ్మెకు గడువు ఉన్నా, మార్చి 22 నుంచే బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. 24, 25 తేదీల్లో సోమ, మంగళవారాల్లో ఈ సమ్మె సందర్భంగా బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి. దీంతో మార్చి 22 నుంచి మార్చి 24 వరకు వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకు సేవలకు అంతరాయం కలుగనున్నది.