WG Ramannapalem: పవన్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు చేపట్టాక తొలి ప్రయత్నంగా ‘పల్లె పండుగ’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఏక కాలంలో నిర్వహించిన గ్రామ సభలు ఓ రికార్డు. పశ్చిమగోదావరి జిల్లాలోని రామన్నపాళెం గ్రామంలోనూ పల్లె పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ కోరికగా సిమెంటు రోడ్లు కావాలని అడిగారు. ఆ వెంటనే ఎక్కడెక్కడ రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉందో గుర్తించడం జరిగింది. అలా గుర్తించిన వాటిలో రామన్నపాళెం ఆకనవారి తోట వీధి ఒకటి. 20 లక్షల రూపాయలతో గతేడాది డిసెంబర్ 10న పనులు ప్రారంభించారు. ఇప్పుడు ఆకనవారి తోటలో చక్కటి సిమెంటు రోడ్డు దర్శనమిస్తోంది. కూటమి ఏడాది పాలనలో మొత్తం 40 లక్షల రూపాయలతో రామన్నపాళెం గ్రామానికి రెండు సిమెంట్లు రోడ్లు మంజూరు చేయడం జరిగిందని అధికారులు చెప్తున్నారు.
Also Read: Mohammed Shami: మహ్మద్ షమీ భార్యపై హత్యాయత్నం కేసు
గత ప్రభుత్వంలో ఒక్క సిమెంట్ రోడ్డు వేసిన పాపాన పోలేదంటున్నారు రామన్నపాళెం గ్రామస్థులు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నిర్వహించిన పల్లె పండుగలో తాము అడిగిన వెంటనే వరంలా సిమెంటు రోడ్డు ప్రసాదించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోడ్డు కోసం అంత సంతోషం ఎందుకంటారా? లోతట్టు ప్రాంతమైన రామన్నపాళెంలో… మొన్నటిదాకా చిన్న వర్షం పడినా అక్కడి మహిళలు, వృద్ధులు పడే ఇబ్బంది ఎలా ఉండేదో.. వారి మాటల్లోనే వినండి.