Rajahmundri Lo Adhi Brand: చారిత్రాత్మక నగరం పవిత్ర గోదావరి నది చెంతన ఉన్న రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరానికి రాజకీయంగా ఎంతో చరిత్ర ఉంది. దశాబ్దాల కాలంగా ఎంతోమంది రాజకీయ దిగ్గజాలు ఇక్కడి నుండే రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర వహించారు. గత ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, యువ నేత నారా లోకేష్ ఇన్‌స్పిరేషన్‌తో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అత్యధిక మెజార్టీతో గెలిచిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.. రాజమండ్రి నగర ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పటివరకు ఉన్న నాయకులు కొండంత హామీలు ఇచ్చారు కానీ గోరంత కూడా పూర్తి చేయలేదు. ఈసారి చెప్పడం కాదు.. చేసి చూపించాలి అనే పట్టుదలతో రాజమండ్రి నగర రూపురేఖలు మార్చాలి అని కంకణం కట్టుకొని.. గడిచిన పద్నాలుగు నెలల కాలంగా అభివృద్ధి బాటలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ.. యువతీ యువకులకు ఒక ఐకాన్‌గా నిలుస్తూ.. కుల, మత భేదాలకు అతీతంగా.. వాసు బాబు అంటే ఇదిగో వస్తున్నా అంటూ.. సమయంతో పని లేకుండా తమ సేవలు అందిస్తున్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్.
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా అందరి మన్ననలు పొందాలి అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే రాజమండ్రి నగరంలో అర్ధ దశాబ్దం కాలంగా టీడీపీలో సీనియర్ నాయకులు ఎంతో మంది పార్టీని నమ్ముకుని ఉన్నారు. వారందర్నీ కలుపుకొని, వారి వద్ద సలహాలు తీసుకుని, మరోపక్క కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకొని వెళ్లాలి. వయసుకు చిన్నవాడైనా తన ఆలోచనలు, రాజకీయ అడుగులు చాలా పెద్దవి అంటున్నారు అక్కడున్న రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే రాజమండ్రిలో జరుగుతున్న అభివృద్ధి పట్ల ప్రజలు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలు కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ.. వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ.. తాను నిద్ర పోకుండా.. అధికారులను సైతం నిద్ర పోనివ్వకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా ఈ యువ ఎమ్మెల్యే పాలనకు రాజమండ్రి ప్రజలు ఫిదా అవుతున్నారట.
Also Read: Telangana Politics: బీజేపీలోకి వెళ్లే ఆ ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు?
రాజకీయాల్లో అందరిదీ ఒక స్టైల్ అయితే ఆదిరెడ్డిది మరో స్టైల్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొహంపై చెరగని చిరునవ్వు, ప్రతి ఒక్కరిని అన్నా అంటూ సంబోధించుకుంటూ కలుపుకునిపోతూ, మహిళలకు ఆపద వస్తే వారికి అన్నలా అండగా నిలుస్తూ, నగరంలో ఆకతాయిల బరతం పడుతూ.. సుపరిపాలనలో సరిలేరు నీకెవరు అంటూ ఒక మంచి బ్రాండ్ సెట్ చేసుకున్నారట ఆదిరెడ్డి. రాజకీయాల్లో కార్యకర్తల అలకలు అనేవి సాధారణమే. ప్రతి కార్యకర్తను తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తూ, వాళ్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ, ఇటు అధిష్టానం వద్దా, అటు ప్రజల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకోవడంలో ఈ యువ ఎమ్మెల్యే ప్రదర్శిస్తున్న తెలివితేటలకు గోదావరి వాసుల్లో మంచి స్పందన లభిస్తోందట. ఇప్పటికే అభివృద్ధిలో ముందుకు పరుగులు తీస్తున్న రాజమండ్రి… 2027 పుష్కరాలకు మరోసారి చరిత్రలో నిలుస్తుంది అంటున్నారు ఇక్కడ రాజకీయ విశ్లేషకులు.