Papaya Leaf Juice Benefits: బొప్పాయి పండుతోనే కాదు ఆకులతో కూడా ప్రయోజనాలు చాలా ఉన్నాయి. బొప్పాయి ఆకు రసంలో విటమిన్ ఎ, ఇ, సి, కె, బి పుష్కలంగా ఉన్నాయి. ఈ జ్యూస్ తాగితే జ్వరం రాదు. ఆకలి తక్కువగా ఉన్నవారికి కూడా ఇది మంచిది. బొప్పాయి ఆకు రసం తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
బొప్పాయి ఆకు రసం శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బొప్పాయి ఆకు రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన నివారణ అని చెప్పవచ్చు. బొప్పాయి ఆకు రసంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయి ఆకు రసం తాగితే కంటిశుక్లం రాదు. దృష్టి మసకబారదు.
Papaya Leaf Juice Benefits: మలబద్ధకంతో బాధపడేవారు బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకుంటే సమస్య తగ్గుతుంది. బొప్పాయి ఆకు రసం తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. బొప్పాయి ఆకులలో ఫినాలిక్ సమ్మేళనాలు, పాపైన్ , ఆల్కనాయిడ్స్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
బొప్పాయి ఆకు రసం తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, అల్సర్ , కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి ఆకు రసం మహిళల్లో రుతుక్రమ సమస్యలను నయం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని హార్మోన్లను నియంత్రిస్తుంది.