Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ ట్యాపింగ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫోన్లు హ్యాక్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏపీ నేతలకు సంబంధించి కేసీఆర్, కేటీఆర్‌ల ఆప్తమిత్రుడు వైఎస్ జగన్‌కు మేలు చేసేందుకు కూడా బీఆర్‌ఎస్ హయాంలో ట్యాపింగ్ జరిగిందని, రికార్డు చేసిన ఆడియోలను రహస్యంగా జగన్‌కు అందజేశారని సమాచారం వస్తోంది. లోకేష్ ఎవరితో మాట్లాడుతున్నారన్న వివరాలను సేకరించి, తెలంగాణకు చెందిన ఓ కీలక నేత ద్వారా జగన్‌కు చేరవేశారని అంటున్నారు.
అంతకు మించి సంచలనంగా, బీఆర్ఎస్ నాయకురాలు కవిత ఫోన్ కూడా ట్యాప్ చేశారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో ఈ విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. కవిత విషయం పక్కనపెడితే… సినీ తారలు, రియల్టర్లు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసి రహస్యాలు సేకరించి బ్లాక్‌మెయిల్ చేశారని గతంలోనూ ఆరోపణలు ఉన్నాయి. విదేశాల నుంచి కొనుగోలు చేసిన ప్రత్యేక పరికరాలతో ఈ ట్యాపింగ్ జరిగినట్లు ప్రభాకర్ రావు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌కు పై నుంచి ఆదేశాలు వచ్చాయని, పై స్థాయిలో చెబితేనే చేశామని ప్రభాకర్‌రావు విచారణ సందర్భంగా వెల్లడించారట. బీఆర్‌ఎస్‌లోని ఇద్దరు కీలక నాయకులు… తమకు ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలో చెప్పేవారని ప్రభాకర్‌రావు బయటపెట్టేశారట.
Also Read: Top 10 Safest Airlines 2025: ప్రపంచంలోని 10 సురక్షితమైన ఎయిర్‌లైన్స్ ఇవే
Phone Tapping Case: అయితే కవిత ఫోన్ ట్యాపింగ్ విషయం కేసీఆర్‌కు తెలియకుండా గోప్యంగా జరిగినట్లు సమాచారం. ప్రభాకర్ రావు మొదట ఖండించినా, ఆధారాలతో అడిగినప్పుడు ఒప్పుకున్నారట. కవిత స్వయంగా తన ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించి ఆశ్చర్యపోయారట. ఈ వ్యవహారంలో కేటీఆర్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వం జగన్‌తో స్నేహపూర్వక సంబంధాల కారణంగా ఏపీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా తమ ఫోన్లు ట్యాప్ అయినట్లు గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్యాపింగ్ ద్వారా ఆర్థిక లావాదేవీలు, రాజకీయ కుట్రలు జరిగాయని అనుమానాలు ఉన్నాయి. సిట్ విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రభాకరరావు విచారణలో వెలుగుచూస్తున్న సంచలన విషయాలు.. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి!