Kommineni

Kommineni: జగన్‌ ఉన్మాదం.. కొమ్మినేని కారాగారవాసం..!

Kommineni: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసి, వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అయితే, ఈ ఉత్తర్వులు వచ్చి రెండు రోజులైనా కొమ్మినేని ఇంకా జైలులోనే ఉన్నారు! ఈ ఆలస్యానికి కారణం వైసీపీ లీగల్ టీమ్ నిర్లక్ష్యమా, లేక రాజకీయ కుట్రనా? ఢిల్లీ వీధుల్లో వైసీపీ నాయకుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి నల్లకోటు వేసుకుని మీడియా ముందు సుప్రీంకోర్టు తీర్పును జయజయధ్వానం చేశారు. కానీ తీర్పు కాపీని సకాలంలో తీసుకోవడంలో విఫలమయ్యారు. సాయంత్రానికి కాపీ అందినా, ప్రక్రియ పూర్తి చేయడంలో ఆలస్యం చేశారు. శనివారం కూడా ఎలాంటి పురోగతి లేకపోగా, ఆదివారం జైలు అధికారులకు సెలవు రోజు కావున విడుదల చేయడం సాధ్యం కాలేదు. దీంతో సోమవారం వరకూ కొమ్మినేని జైల్లోనే ఉండాల్సి వచ్చింది.

వైసీపీ లీగల్ టీమ్ నిర్లక్ష్యం ఒకవైపుంటే… మరోవైపు ఈ ఆలస్యం రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. కొమ్మినేని జైల్లో ఎక్కువ రోజులు ఉంటే, వైసీపీకి రాజకీయంగా సానుభూతి లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు బెయిల్ షరతులను కింది కోర్టు నుంచి పొందాలని ఆదేశించగా, ఈ ప్రక్రియ సోమవారం పూర్తవుతుందా లేదా అన్నది సందేహంగానే ఉంది. ఇదిలా ఉంటే, అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజును వైసీపీ పూర్తిగా వదిలేసింది.

Also Read: Chevireddy Workings: పోలీసులపై దౌర్జన్యంలో ఇది నెక్ట్స్‌ లెవెల్‌!

Kommineni: ఆయనకు ఎలాంటి న్యాయ సహాయం చేయకుండా, “ఆయనకు, మాకు సంబంధం లేదు” అని పార్టీ స్పష్టం చేసింది. కాగా, కృష్ణంరాజు సొంతంగా లాయర్‌ను నియమించుకోవాల్సి వచ్చింది. కొమ్మినేనిని జైల్లో ఉంచి, కృష్ణంరాజును వదిలించుకోవడం ద్వారా, వైసీపీ రాజకీయ లబ్ధి కోసం డ్రామా ఆడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి టీవీ డిబేట్‌లో జరిగిన వివాదం తర్వాత, కొమ్మినేని అరెస్టు పత్రికా స్వేచ్ఛకు ఆటంకమని సుప్రీంకోర్టు పేర్కొంది. అప్పటినుండి వైసీపీ ఈ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటోందని ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణంరాజు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ వివాదంలో మహిళల నిరసనలపై వైసీపీ నేత సజ్జల చేసిన వ్యాఖ్యలపైన అమరావతిలో నిరసనలు కొనసాగుతున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AP News: పోలీసులపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన ఏపీ పోలీసు అధికారుల సంఘం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *