Mutton: మాంసాహారం అంటే చాలా మందికి ఇష్టమే ఉంటుంది. కొందరైతే రోజూ పెట్టిన తినేవాళ్లు ఉంటారు. ఆదివారం వస్తే చాలు మాంసాహార ప్రియులకు అదో పండుగ లాంటిది. మాంసాహారం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ సరైన పద్ధతిలో తినాలి. లేదంటే ప్రాణానికే ముప్పు అంటున్నారు నిపుణులు.
అయితే ఈ రోజుల్లో చాలా మంది వివిధ వ్యాధుల కారణంగా, ముఖ్యంగా కొలెస్ట్రాల్, మధుమేహం, యూరిక్ యాసిడ్ మొదలైన వాటి కారణంగా మాంసాహారాన్ని తగ్గించారు. అలాంటి మటన్ తినే సమయంలో కొన్ని విషయాలను పాటించడం తప్పనిసరి. కొన్ని ఆహారపదార్థాలతో మటన్ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది. అందుకే మటన్‌తో ఎలాంటి ఆహారపదార్థాలు తినకూడదో చూద్దాం.
Mutton: మటన్ లేదా చికెన్ తినే ముందు లేదా తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు తాగవద్దు. ఎందుకంటే ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఇది శరీరంలో వివిధ సమస్యలను కలిగిస్తుంది. మటన్ తినడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మటన్ తిన్న తర్వాత తేనె తినకూడదు.
ఎందుకంటే మాంసాహారం తిన్న వెంటనే తేనె తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. సాధారణంగా చాలా మందికి భోజనం తర్వాత కాఫీ, టీలు తాగే అలవాటు ఉంటుంది. వారు మటన్ తినేటప్పుడు ఈ అలవాటు మానుకోవడం అవసరం. ఎందుకంటే ఇది అజీర్ణం మరియు గుండెల్లో మంటను కలిగిస్తుంది.