Cricket Stadium

Cricket Stadium: వరల్డ్‌ లార్జెస్ట్‌ స్టేడియం @అమరావతి

Cricket Stadium: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం. ఇది మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ని అధిగమించి ఈ స్థానాన్ని సంపాదించింది. నరేంద్ర మోడీ స్టేడియం 1,32,000 మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగి అంటే… సీటింగ్ కెపాసిటీ మాత్రం 1,14,600గా ఉంది. ఇప్పుడీ రికార్డుని ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి బ్రేక్‌ చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ఐసీసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి బీసీసీఐ ఫండింగ్‌ చేయనుంది.

అయితే ఇందుకు ప్రణాళికలు రచించింది, అనుమతులు సాధించింది, ఆర్థిక సహాయానికి బీసీసీని ఒప్పించింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. అమరావతిలో ఏర్పాటు కాబోయే ఈ స్టేడియం సామర్థ్యం 1,25,000 మంది ప్రేక్షకులుగా ప్రాధమికంగా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే నిర్మాణంలో సీటింగ్‌ కెపాసిటీని 1,32,000 దాటించే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, నరేంద్ర మోడీ స్టేడియం రికార్డును బద్దలు కొట్టే అవకాశాలున్నాయి.

Cricket Stadium: ఈ స్టేడియం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 60 ఎకరాల భూమిని కోరింది ఆంధ్రా క్రికెట్‌ అసోషియేషన్‌. అమరావతిలో 200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన స్పోర్ట్స్ సిటీలో భాగంగానే ఈ క్రికెట్‌ స్టేడియాన్ని నిర్మిస్తారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ అయిన కేశినేని శివనాథ్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నడిపిస్తున్నారు. అమరావతిలో ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం భూమి సేకరణ, ఆర్థిక సహాయం కోసం BCCIతో సంప్రదింపులు అన్నీ కేశినేని శివనాథే చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అమరావతిని అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా మార్చాలని, దేశంలో క్రికెట్ మౌలిక సదుపాయాలను పునర్నిర్వచించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కేశినేని శివనాథ్‌. రెండు నుంచి రెండున్నర ఏళ్ల లోపల దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ని శివనాథ్‌ టేకప్‌ చేసినప్పటి నుండి ఏసీఏ దశ మొత్తం మారిపోయిందని చెప్పొచ్చు. 2029 నేషనల్ గేమ్స్‌ను అమరావతిలో నిర్వహించేందుకు బిడ్ చేశారు. ఉత్తరాంధ్ర, విజయవాడ, రాయలసీమల్లో అత్యాధునిక క్రికెట్ అకాడమీల స్థాపనకు ప్రణాళికలు చేస్తున్నారు. ఇవి మిథాలీ రాజ్, రాబిన్ సింగ్ వంటి క్రికెట్ దిగ్గజాల పర్యవేక్షణలో నడవనున్నాయి. క్రికెట్‌లో ప్రతిభావంతులను ప్రోత్సహించడం ద్వారా రాబోయే రెండేళ్లలో కనీసం 15 మంది ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కేశినేని శివనాథ్‌.

Also Read: Shihan Hussaini: పవన్‌ కల్యాణ్‌ గురువు షిహాన్‌ హుసైని కన్నుమూత

ALSO READ  PKL 11: పట్నా పై యూపీ ఉత్కంఠ విజయం

Cricket Stadium: విశాఖపట్నం స్టేడియంను కేవలం నెలా పది రోజుల్లోనే ఆధునికీకరించి ఐపీఎల్ మ్యాచ్‌లకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో కేశినేని శివనాథ్‌ కృషిని క్రికెట్‌ పండితులు అభినందిస్తున్నారు. మంత్రి లోకేష్‌ చొరవ, ఏసీఏ చీఫ్‌ కేశినేని శివనాథ్‌ కృషితో ఈనెల 24, 30 తేదీల్లో విశాఖ స్టేడియంలో జరిగే రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఆస్వాదించనున్నారు క్రికెట్‌ అభిమానులు.

గత ఐదేళ్ల వైసీపీ హయాంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారన్న విమర్శలున్నాయి. విజయసాయిరెడ్డికి చెందిన బంధువులు, వర్గీయులు ఏసీఏని కబ్జా చేసి తమ విలాసాలకు వాడుకున్నారనీ, రాష్ట్రంలో క్రికెట్‌ని భ్రష్టు పట్టించి, అద్భుతమైన భవిష్యత్తు ఉన్న ఎందరో క్రీడాకారుల జీవితాలతో ఆటలాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అటువంటి వైసీపీ నేతలు విశాఖ స్టేడియానికి పేరు మార్పుపై అనవసర రాద్ధాంతం చేయడాన్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు కేశినేని చిన్ని. తాము క్రీడల్లో రాజకీయాలు చొప్పించదలుచుకోలేదని, విశాఖలోనే కాదు.. కడప జిల్లా పులివెందులలో కూడా త్వరలో మ్యాచ్‌లు నిర్వహిస్తామని తెలిపారు. అలా అందరు రాజకీయ నేతల్లా మాటలతో కాకుండా తన పనులతోనే ప్రత్యర్థులకు కౌంటర్లివ్వడం కేశినేని చిన్ని స్పెషాలిటీగా చెప్తున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *