PKL 11: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-11లో భాగంగా పట్నా పైరేట్స్ తో జరిగిన మ్యాచ్ యూపీ యోధాస్ జట్టు ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ఆద్యంతం రెండు జట్టు విజయం కోసం హోరాహోరీగా తలపడ్డాయి. ఆఖరి వరకు పట్టు వదలకుండా పోరాడిన యూపీ యోధాస్ టీమ్ 44-42 స్కోరుతో పట్నా పైరేట్స్‌ను అడ్డుకుని అద్భుత విజయాన్నందుకుంది. యూపీ యోధాస్ ప్లేయర్ భవాని రాజ్‌పుత్ 10 పాయింట్లతో జట్టు గెలుపులో కీరోల్ ప్లే చేశాడు. మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్ 51-34తో బెంగాల్ వారియర్స్‌ను చిత్తుగా ఓడించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన పుణెరి విరామ సమయానికే 24-11తో తిరుగులేని ఆధిక్యం అందుకుంది. విరామం అనంతరం అదే జోరు కొనసాగించిన పుణెరి మ్యాచ్ ను తేలిగ్గా గెలిచింది. పుణెరి జట్టులో ఆకాశ్9, మోహిత్ గోయత్ 9 పాయింట్లతో రాణించి గెలుపు అందించారు.