Nara Lokesh: తిరుపతి కూటమి సభలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. రెండేళ్ల పాలనలో దాడులు, బూతులు లేని స్వేచ్ఛా వాతావరణం కల్పించామన్నారు. దేవుడితో పెట్టుకున్నందుకే జగన్‌కు ఈ గతి పట్టిందన్నారు. కూటమిది క్రెడిబిలిటీ అయితే వైసీపీది క్రిమినాలిటీ అని.. కియా తెచ్చిన ఘనత బాబుదైతే, కిడ్నాప్‌లు చేసింది వైసీపీ అని మండిపడ్డారు. చంద్రబాబు సీమను రత్నాల సీమగా మార్చారని చెబుతూ.. అరాచకాలకు పాల్పడితే ‘రెడ్ బుక్’ తన పని తాను చేసుకుపోతుందని లోకేశ్ హెచ్చరించారు.
మరింత Nara Lokesh: మనది ఫైటర్ జెట్.. వాళ్లది ఫ్యాక్షన్.. రెడ్ బుక్ దాని పని అది చేసుకుపోతుంది!Author: MAHAA News Desk
Crime News: పేరుకే లాయర్.. కూతురిని చంపిన కసాయి తల్లి
Crime News: ప్రియుడు మోహన్‌తో కలిసి జీవించడానికి అడ్డుగా ఉందని ఐదేళ్ల కూతురు వెన్నెలను హత్య చేసిన తల్లి, లాయర్ ప్రియాంకను కాడుగోడి పోలీసులు హాసనలో అరెస్ట్ చేశారు. కోటీశ్వరుడినని నమ్మించిన మోహన్ కోసం ప్రియాంక భర్తను వదిలేసి వచ్చింది. పాప అనారోగ్యంతో చనిపోయిందని అంత్యక్రియలు పూర్తి చేసినా, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై భర్తకు అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో హత్య ఉదంతం వెలుగుచూసింది. తీరా చూస్తే ప్రియుడు కోటీశ్వరుడు కాదు, కేవలం అద్దె ఇళ్ల బ్రోకర్ అని తేలింది.
మరింత Crime News: పేరుకే లాయర్.. కూతురిని చంపిన కసాయి తల్లిCrime News: బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక నటి ఆత్మహత్య.. 10 రోజులైనా స్పందించని పోలీసులు?
Crime News: హైదరాబాద్ సైదాబాద్‌లో షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య చేసుకుంది. కొంతమంది యువకులు ఆమె బాత్‌రూమ్ వీడియోలను రహస్యంగా తీసి, గత 6 నెలలుగా లైంగికంగా వేధిస్తూ, బ్లాక్‌మెయిల్ చేయడంతో మనస్తాపానికి గురైంది. ఆత్మహత్యకు ముందే పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తండ్రి లేని ఆ కుటుంబంలో కూతురిని కోల్పోయిన తల్లి.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.
మరింత Crime News: బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక నటి ఆత్మహత్య.. 10 రోజులైనా స్పందించని పోలీసులు?Raghava Lawrence: అమ్మ గ్రీన్ సిగ్నల్.. ప్రజల తీర్పే ఫైనల్..
Raghava Lawrence: ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై కీలక ప్రకటన చేస్తూ, ప్రజలు అంగీకరిస్తేనే రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఇందుకోసం తన తల్లి అనుమతి కూడా లభించిందన్నారు. కాగా, ఈ ఏడాది జరిగిన తమిళనాడు ఎన్నికల్లో రెండు చోట్లా గెలిచిన టీవీకే అధినేత విజయ్.. తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకోవడంతో అక్కడ ఉప ఎన్నిక రానుంది. విజయ్‌తో ఉన్న మంచి అనుబంధం కారణంగా లారెన్స్ టీవీకే పార్టీలో చేరి అక్కడి నుంచే పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
మరింత Raghava Lawrence: అమ్మ గ్రీన్ సిగ్నల్.. ప్రజల తీర్పే ఫైనల్..2027 ODI World Cup: హార్దిక్‌కు బ్యాకప్‌గా ‘నితీశ్ రెడ్డి’ పర్‌ఫెక్ట్.. కెప్టెన్ గిల్‌కు ‘రో-కో’ మార్గదర్శకత్వం తప్పనిసరి
2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్ కోసం హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయంగా తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని సురేశ్ రైనా సూచించాడు. వరల్డ్‌కప్‌లో రోహిత్, విరాట్ కోహ్లీల అనుభవం జట్టుకు ఎంతో కీలకమని.. వారిద్దరి మార్గదర్శకత్వం కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు మైదానంలో పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని రైనా, అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. అలాగే యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ ఎంపికను కుంబ్లే స్వాగతించాడు.
మరింత 2027 ODI World Cup: హార్దిక్‌కు బ్యాకప్‌గా ‘నితీశ్ రెడ్డి’ పర్‌ఫెక్ట్.. కెప్టెన్ గిల్‌కు ‘రో-కో’ మార్గదర్శకత్వం తప్పనిసరిKona Shashidhar: మెగా డీఎస్సీ వంద శాతం పారదర్శకం.. లీకేజీకి ఆస్కారమే లేదు!
Kona Shashidhar: మెగా డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. టీసీఎస్ అయాన్ ద్వారా 42 వేల ప్రశ్నల బ్యాంక్‌తో, రోజువారీ పాస్‌వర్డ్‌లు మారుస్తూ పరీక్షలు జరిపామన్నారు. టెట్ 20%, డీఎస్సీ 80% వెయిటేజీతో మెరిట్ లిస్ట్ ఇచ్చామని.. 1:1 కాల్‌లెటర్ వస్తే ఉద్యోగం ఖాయం కాదన్నారు. ఫస్ట్ ర్యాంకర్ నవీన్ వెరిఫికేషన్‌కు రానందున ఉద్యోగం ఇవ్వలేమన్నారు. సందేహాల కోసం స్పెషల్ సెల్ ఏర్పాటు చేశామని, త్వరలో మరో డీఎస్సీ ఉంటుందని వెల్లడించారు.
మరింత Kona Shashidhar: మెగా డీఎస్సీ వంద శాతం పారదర్శకం.. లీకేజీకి ఆస్కారమే లేదు!Kitchen Tips: గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా? ఈ 4 చిట్కాలతో ప్రతి నెలా 15% నుండి 20% గ్యాస్ ఆదా చేసుకోండి!
Kitchen Tips:గ్యాస్ బర్నర్లలో జిడ్డు లేకుండా క్రమం తప్పకుండా క్లీన్ చేయడం, వంటకు ముందే కూరగాయలు కోసి పెట్టుకోవడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది. వంట చేసేటప్పుడు గిన్నెలపై మూతలు పెట్టడం, పప్పులు ముందే నానబెట్టడం మరియు ప్రెజర్ కుక్కర్లను ఎక్కువగా వాడటం ద్వారా ప్రతి నెలా గ్యాస్ వినియోగాన్ని 15 నుండి 20 శాతం వరకు తగ్గించుకోవచ్చు.
మరింత Kitchen Tips: గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా? ఈ 4 చిట్కాలతో ప్రతి నెలా 15% నుండి 20% గ్యాస్ ఆదా చేసుకోండి!TRS: టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ సెంటిమెంట్..!
TRS: కవిత ఏర్పాటు చేయబోతున్న ‘తెలంగాణ రక్షణసేన (టీఆర్‌ఎస్)’ పార్టీ పేరుపై బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీఐకి ఫిర్యాదు చేసింది. ప్రజలు ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌గానే గుర్తుంచుకున్నారని, ఈ పేరు తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్నందున వేరే ఎవరికీ కేటాయించవద్దని కోరింది. కాగా, ఈ పేరుపై ఈసీఐకి ఇప్పటివరకు దాదాపు 700 అభ్యంతరాలు రావడం విశేషం.
మరింత TRS: టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ సెంటిమెంట్..!Attacks Must End: ఒమన్ తీరంలో నౌకలపై అమెరికా దాడులు.. ముగ్గురు భారతీయుల మృతి..!
Attacks Must End: ఒమన్ తీరంలో అమెరికా జరిపిన దాడుల వల్ల నౌకల్లో ఉన్న ముగ్గురు భారతీయ నావికులు మరణించగా, పలువురిని రక్షించారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందిస్తూ న్యూఢిల్లీలోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసి నిరసన తెలిపింది. పశ్చిమ ఆసియాలో దాడులు ఆపి చర్చలు జరపాలని కోరింది. ప్రస్తుతం గల్ఫ్ రీజియన్‌లో 18 వేల మందికి పైగా భారతీయ నావికులు ఉన్నందున వారి భద్రతపై కేంద్రం నిరంతర నిఘా ఉంచింది.
మరింత Attacks Must End: ఒమన్ తీరంలో నౌకలపై అమెరికా దాడులు.. ముగ్గురు భారతీయుల మృతి..!Meenakshi Natarajan: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. ముగ్గురు బీజేపీ అభ్యర్థుల ఏకగ్రీవం!
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో బీజేపీ అభ్యర్థులు Meenakshi Natarajan: తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్, మహేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ అన్యాయంపై రేపు 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
మరింత Meenakshi Natarajan: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. ముగ్గురు బీజేపీ అభ్యర్థుల ఏకగ్రీవం!