Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో కాసేపు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇది ఎలాంటి ఆందోళనకర పరిస్థితి కాదని, సాధారణ వైద్య పరీక్షల (Routine Medical Checkup) నిమిత్తమే ఆమె ఆసుపత్రికి వెళ్లినట్లు స్వయంగా హోంమంత్రి కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి.
