Aurangzeb Tomb: ఔరంగజేబు దిష్టిబొమ్మ దహనం సందర్భంగా హింస చెలరేగడంతో నాగ్‌పూర్‌లోని 11 ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసలో 33 మంది పోలీసులు గాయపడ్డారు. వారిలో 3 మంది డీసీపీలు ఉన్నారు. ఐదుగురు పౌరులు కూడా గాయపడ్డారు, వారిలో ఒకరు ఐసియులో ఉన్నారు. అల్లరిమూకలు 12 బైకులు, అనేక కార్లు, 1 జేసీబీని తగలబెట్టారు. అల్లర్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసులు 50 మందిని అరెస్టు చేశారు. అదే సమయంలో, శంభాజీనగర్‌లో ఔరంగజేబు సమాధికి భద్రతను పెంచారు. సమాధికి దారితీసే రహదారులను బారికేడ్లు వేశారు. వచ్చే – వెళ్ళే ప్రతి వ్యక్తిని తనిఖీ చేస్తున్నారు..
ఔరంగజేబు సమాధిని బిజెపి తొలగించవచ్చు
శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ – కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉన్నందున ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఔరంగజేబు సమాధిని బిజెపి తొలగించగలదని అన్నారు. నేను ముఖ్యమంత్రిని కాదు, హోం మంత్రిని కూడా కాదు, నాగ్‌పూర్ హింస వెనుక ఎవరున్నారో ముఖ్యమంత్రిని అడగండి. ఎందుకంటే ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది అని ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి: AP Heat Wave Alert: ఏపీలోని 58 మండలాలకు హీట్ వేవ్ హెచ్చరిక..
మహారాష్ట్ర డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విఫలమైతే, వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఉద్ధవ్ ఠాక్రే. మీకు కావాలంటే ఔరంగజేబు సమాధిని తొలగించవచ్చు, కానీ ఆ సమయంలో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లకు ఫోన్ చేయండి అంటూ సెటైర్ వేశారు.
ఔరంగజేబు నిజానికి గుజరాత్‌లో జన్మించాడని ఆయన అన్నారు. ఆయన 1618లో గుజరాత్‌లోని దాహోద్‌లో జన్మించారు. 1707లో మహారాష్ట్రలోని భింగర్ సమీపంలో మరణించారు. ఆయన మరణించి 300 సంవత్సరాలు అయ్యింది.
అదే సమయంలో, మహారాష్ట్రను మణిపూర్ లాగా మార్చడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆదిత్య ఠాక్రే అన్నారు. విచారకరంగా, బిజెపి పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అది హింస – అల్లర్లకు పాల్పడుతుంది. మణిపూర్‌లో ఎలా జరిగిందో.. మహారాష్ట్రను సరిగ్గా అలాగే చేయాలనుకుంటున్నారు. వారు 300 సంవత్సరాల క్రితం జీవించిన ఒకరి చరిత్రను తవ్వి తీయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ఆదిత్య ఠాక్రే విమర్శలు కురిపించారు.