Viral Video

Viral Video: రైలు ఎక్కుతుండగా పడిపోయిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే ?

Viral Video: ముంబైలోని అంధేరి రైల్వే స్టేషన్‌లో ఆదివారం హృదయ విదారక సంఘటన జరిగింది. ఈ సంఘటన ప్లాట్‌ఫామ్ నంబర్ 8 వద్ద జరిగింది. రైలు బయలుదేరిన వెంటనే ఒక యువకుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కుతుండగా అతని కాళ్ళు జారి పడిపోయాడు. అక్కడ డ్యూటీలో ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సబ్-ఇన్‌స్పెక్టర్ పవన్ సింగ్ వెంటనే తన చాకచక్యాన్ని ఉపయోగించి ఆ యువకుడి చేయి పట్టుకుని సురక్షితంగా బయటకు లాగాడు.

ప్రయాణీకుడు రాజేంద్ర మంగీలాల్ కదులుతున్న రైలు (లోక్ శక్తి ఎక్స్‌ప్రెస్) ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో, అతను తన బ్యాలన్స్ ను కోల్పోయి రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్యకు వచ్చాడు. అయితే, అక్కడే ఉన్న అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ వెంటనే ఆ ప్రయాణికుడిని పట్టుకుని ప్లాట్‌ఫారమ్‌పైకి లాగాడు. ఈ సంఘటన మొత్తం ప్లాట్‌ఫారమ్‌పై ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డైంది.

వీడియోను ఇక్కడ చూడండి:

సబ్-ఇన్‌స్పెక్టర్ విచారణలో, రాజేంద్ర మంగీలాల్ (40) తాను అంధేరీలో నివసిస్తున్నానని, లోక్ శక్తి ఎక్స్‌ప్రెస్‌కి టికెట్ ఉందని, అహ్మదాబాద్ వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు. అతను స్టేషన్ చేరుకోవడంలో ఆలస్యం అయ్యాడు మరియు రైలు వెళ్ళిపోయింది. అతను కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించి బ్యాలెన్స్ కోల్పోయాడు, అతని పాదాలు జారి అకస్మాత్తుగా కింద పడిపోయాడు.

సంఘటనా స్థలంలో ఉన్న ఆర్‌పిఎఫ్ సిబ్బందికి మంగీలాల్ తన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hypersonic Missile: హైపర్‌ సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *