Tirupati: తిరుపతి జిల్లాలోని వసుంధర నగర్ లో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ క్యాంపస్ ఏవో వెంకటరమణ పై ఆదివారం రాత్రి అదే కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అస్లాం కత్తితో గొంతులో కుర్చీ హత్యాయత్నంకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, అడసుపల్లికి చెందిన వెంకటరమణ(52), తిరుపతి శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో క్యాంపస్ ఏవోగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి అనుమానం వచ్చి ఏవో విద్యార్థుల బ్యాగులు తనిఖీచేస్తుండగా, పీలేరుకు చెందిన అస్లాం అనే ఎంపీసీ విద్యార్థి ఏవో గొంతులో కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన ఏవో ను సహచర సిబ్బంది వెంటనే తిరుపతి రుయాకు తరలించారు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీకి చేరుకొని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది తిరుపతి చైతన్య ఏవో వెంకటరమణ పై దాడి చేసిన మైనర్ విద్యార్థి పై హత్యాయత్నం కేసు నమోదు.
