Ap weather: ఆంధ్రప్రదేశ్‌లో రేపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతంలో గాలుల వేగం గంటకు 40-50 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని వెల్లడించారు.
తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు తీవ్రంగా వీచే అవకాశముండటంతో మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు
ఆదిలా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
ఉష్ణోగ్రతలు పెరుగనున్న సూచనలు
మూడు రోజుల తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని, ఉదయం మరియు మధ్యాహ్నపు సమయంలో వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రంసూచించింది.