Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్’ వెబ్ సిరీస్ డిజిటల్ థ్రిల్లర్ జోనర్‌లో కొత్త అనుభవాన్ని అందించనుంది. రాజేష్ ఎం. సెల్వా దర్శకత్వంలో అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సిరీస్ అక్టోబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. శ్రద్ధా గేమ్ డెవలపర్‌గా కనిపిస్తూ, భయానక సంఘటనల చుట్టూ రహస్యాలను ఛేదించే పాత్రలో మెప్పిస్తుంది. సంతోష్ ప్రతాప్, చాందిని, బాలా హసన్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ డిజిటల్ యుగంలో సంబంధాలు, మోసాలపై కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ఊహించని ట్విస్ట్‌లు, ఉత్కంఠ భరిత సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేసేలా రూపొందింది. శ్రద్ధా నటన, కథాంశం ఈ సిరీస్‌ను హైలైట్ చేయనున్నాయని మేకర్స్ చెబుతున్నారు.
