Marri Rajasekhar Resigns

Marri Rajasekhar Resigns: వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ రాజీనామా!

Marri Rajasekhar Resigns: వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపినట్లు సమాచారం. 2014లో చిలకలూరిపేట టికెట్‌పై పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. 2019లో టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెందిన రాజశేఖర్‌కు, జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.

అయితే, ఇటీవల చిలకలూరిపేట బాధ్యతలను విడుదల రజనీకి అప్పగించడంతో రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఆయన టీడీపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahaa Vamsi: అధికారులారా.! ఆధారాలు కావాలా ? మీకు మేము ఇస్తాం రండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *