Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ జంటపై సోషల్ మీడియాలో ఓ ఫన్నీ మీమ్ వైరల్‌గా మారింది. ‘మహేష్ బాబుకి గిఫ్టింగ్ కాన్సెప్ట్ గురించి తెలీదు’ అంటూ నమ్రత ఓ సందర్భంలో తెలిపింది. అంటే మహేష్ బాబుకి కూడా చాలా మంది లాగే అమ్మాయిలని గిఫ్ట్ లతో ఇంప్రెస్ చెయ్యడం తెలీదు. దీన్ని బట్టి మహేష్ బాబుకి ఎంత మొహమాటం ఉందో తెలిసిపోతుంది. అయితే దీన్ని ఓ మీమ్ గా చేసి తెగ వైరల్ చేస్తున్నారు. ఆ మీమ్ లో ‘అన్నా కుడా మనోడే’ అంటూ రఘువరన్ బీటెక్ సినిమా సీన్‌ని జోడించారు. ఈ మీమ్‌లో మహేష్ బాబు, నమ్రత ఒకరి పక్కన ఒకరు కూర్చున్న ఫోటో ఉండగా, పైన నమ్రత కామెంట్ యాడ్ చేసి దిగువన ‘అన్నా కుడా మనోడే’ అనే డైలాగ్‌తో హాస్యం పండించారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ మీమ్‌ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నమ్రత, మహేష్ బాబు జంట ఎప్పుడూ అభిమానులకు ఫేవరెట్. వీరి కెమిస్ట్రీ ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్‌స్క్రీన్‌లోనూ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ఇలాంటి ఫన్నీ మీమ్స్ రావడం కొత్తేమీ కాదు. మహేష్ బాబు ప్రస్తుతం SSMB 29 తో బిజీగా ఉండగా, ఈ మీమ్ అభిమానులకు మంచి వినోదం అందిస్తుంది.
View this post on Instagram