Balakrishna-Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవితో డైరెక్టర్ అనిల్ రావిపూడి సూపర్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, చిరు ప్రాజెక్ట్ తర్వాత అనిల్ తన దృష్టిని గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వైపు మళ్లించనున్నారని సమాచారం. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సక్సెస్‌తో ఉత్సాహంగా ఉన్న బాలయ్య మరోసారి అనిల్‌తో చేతులు కలపడానికి సిద్ధమయ్యారట. చిరంజీవి సినిమా పూర్తయిన వెంటనే ఈ కొత్త కాంబోను అనిల్ అధికారికంగా ప్రకటించనున్నారని టాక్. ఈ అనౌన్స్‌మెంట్ బాలయ్య అభిమానుల్లో జోష్ నింపడం ఖాయం. అనిల్ రావిపూడి మాస్ డైరెక్షన్, బాలయ్య ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో ఈ చిత్రం మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ కాంబినేషన్ టాలీవుడ్‌లో మరో సంచలనానికి తెరలేపనుంది.
