Squid Game 3: ఈ మధ్య కాలంలో వరల్డ్ వైడ్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న వెబ్ సీరిస్ ఏదైనా ఉందంటే అది ‘స్క్విడ్ గేమ్’. దీనికి లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని నెట్ ఫ్లిక్స్ సంస్థ సీజన్ 2ను చిత్రీకరించింది. అయితే దానిని అర్థంతరంగా ముగించడంతో చాలామంది కినుక వహించారు. అయితే ఆ లోటును తీర్చుతూ ఇప్పుడు సీజన్ -3’ చిత్రీకరిస్తున్నారు. ఇదే యేడాది దానిని స్ట్రీమింగ్ చేస్తామని నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలిపింది. అయితే ఆ డేట్ ను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆ రిలీజ్ డేట్ ఎప్పుడదేని ఇప్పుడు జనంలోకి వచ్చేసింది. ఈ యేడాది జూన్ 27న ‘స్క్విడ్ గేమ్ -3’ స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. అయితే… దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తోందో చూడాలి.