Amitabh Bachchan: ఎనిమిది పదుల వయసు దాటినా బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ యువ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. మరో పక్క టీవీ ఎపిసోడ్స్, కమర్షియల్ యాడ్స్ తో నిత్యం బిజీగానే ఉంటున్నారు. ఆయన ఆరోగ్య రహస్యం కూడా ఎప్పుడూ పని చేస్తూ ఉండటమే అంటుంటారు సన్నిహితులు. ఓ పక్క అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్… తన భార్య ఐశ్వర్యారాయ్ కు విడాకులు ఇవ్వబోతున్నాడనే వార్తలు తరచూ మీడియాలో దర్శనం ఇస్తూ ఉన్నాయి.
Amitabh Bachchan: వీటిని పట్టించుకోకుండా అభిషేక్, ఐశ్వర్య తమ పనులు తాముచేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అధికారికంగా అవుననో, కాదనో ఓ మాట కూడా మాట్లాడటం లేదు. ఇదిలా ఉంటే… తాజాగా అమితాబ్ బచ్చన్ తన కొడుకు అభిషేక్ తో కలిసి ఏకంగా పది ఫ్లాట్స్ ను కొన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబైలోని ములుంద్ లో దాదాపు 25 కోట్ల విలువ చేసే ఫ్లాట్స్ ను వీరు కొన్నారట. ఇటీవలే అభిషేక్ నటిస్తున్న ‘ఐ వాంట్ టు టాక్’ మూవీ టీజర్ జనం ముందుకు వచ్చింది.