Amaravati: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఆయన కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం వెలగపూడిలోని సచివాలయంలో మంత్రులు, అధికారులు, పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మోదీ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శనం చేసుకోనున్నారు. అనంతరం ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు.
ప్రధాని పాల్గొననున్న జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పర్యటన ఏర్పాట్లు చేయాలని, సభకు వచ్చే ప్రజలకు ఆహారం, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.